ఈ నెల భారత్‌లో లాంచ్ అవుతున్న టాప్ కార్లు ఇవే!

2023, జూన్ నెలలో వివిధ ఆటోమొబైల్( Automobile ) తయారీదారులు భారతదేశంలో అనేక కొత్త కార్లను ప్రవేశపెట్టనున్నాయి.అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

 These Are The Top Cars Being Launched In India This Month Details, June Car Rele-TeluguStop.com

1.హోండా ఎలివేట్: జూన్ 6వ తేదీన, హోండా తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ అయిన ఎలివేట్‌ను ఆవిష్కరించనుంది.ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుందని, మాన్యువల్ & CVT ట్రాన్స్‌మిషన్లను అందిస్తుందని సమాచారం.ఎస్‌యూవీలో అధునాతన ADAS, హైబ్రిడ్ మోటార్ కూడా ఉండవచ్చు.

2.మారుతి సుజుకి జిమ్నీ

: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి జిమ్నీ( Maruti Suzuki Jimny ) ఫైవ్-డోర్ వెర్షన్ జూన్ 7న విడుదల కానుంది.ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆఫర్ చేస్తుంది.

3.వోల్వో C40 రీఛార్జ్

: జూన్ 14వ తేదీన వోల్వో తన రెండవ ఎలక్ట్రిక్ కారు C40 రీఛార్జ్‌ను( Electrical C40 Recharge ) భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరించనుంది.దీని ఫీచర్లు, వేరియంట్‌ల గురించిన వివరాలు తెలియరాలేదు.ఇది 78kWh బ్యాటరీ ప్యాక్, 400bhp & 660Nm టార్క్‌ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది.సింగిల్ ఛార్జ్‌పై 420km వరకు రేంజ్ ఆఫర్ చేస్తుంది.

4.మెర్సిడెస్ బెంజ్ SL55 రోడ్‌స్టర్

: మెర్సిడెస్ బెంజ్ జూన్ 22న SL55 రోడ్‌స్టర్ అనే కన్వర్టిబుల్ కారును విడుదల చేయనుంది.ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో 476bhp, 700Nm టార్క్‌ను అందిస్తుంది.కారు 11.9-అంగుళాల MBUX స్క్రీన్ అందిస్తుంది.15 సెకన్లలో తెరుచుకునే లేదా మూసివేసే సాఫ్ట్ టాప్ కలిగి ఉంటుంది.

5.వోక్స్‌వ్యాగన్ టైగన్, వర్టస్ స్పెషల్ ఎడిషన్లు

: వోక్స్‌వ్యాగన్ కంపెనీ టైగన్, వర్టస్ సిరీస్‌ల కోసం ప్రత్యేక ఎడిషన్లు, కొత్త వేరియంట్‌లను పరిచయం చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube