తెలుగు సినిమా స్థాయి ని పెంచే డైరెక్టర్లు వీళ్లు ముగ్గురే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతం చాలా మంది డైరెక్టర్లు వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను చాటుకుంటు ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు.

వాళ్ళలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు.ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకోగా ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఇక ఆయన పాన్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా కొనసాగుతాడు అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు.ఇక ఈయన తో పాటు గా అనిమల్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న సందీప్ రెడ్డివంగ కూడా పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఈయన చేసిన సినిమాలు అన్నీ కూడా భారీ రేంజ్ లో హిట్ అవుతున్నాయి.అందుకే వాటిని పాన్ వరల్డ్ లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

Advertisement

ఇక ఈయన చేసిన మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో ఈయన పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ప్రస్తుతం గుర్తింపు పొందుతున్నాడు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ తెలుగు సినిమాని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక పుష్ప 2 సినిమాతో తెలుగు సినిమా సత్తా ని మరోసారి పాన్ ఇండియా లెవల్లో చూపించడానికి రెడీ అవుతుండగా ఈ సినిమా సక్సెస్ అయితే సుకుమార్ బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్ర వేస్తారు.ఇక పుష్ప సినిమాతో బాలీవుడ్ లో పాగా వేసిన ఆయన ఈ సినిమాతో అక్కడి ప్రేక్షకుల్లో విపరీతమైన అభిమానాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు