సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ ల్యాప్ టాప్ లను( Laptops ) ఉపయోగిస్తున్నారు.కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ల్యాప్ టాప్ ఉండాల్సిన పరిస్థితులు వచ్చేశాయి.
అయితే మార్కెట్లో నిత్యం అద్భుతమైన ఫీచర్లతో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ల్యాప్ టాప్స్ విడుదల అవుతూనే ఉన్నాయి.కానీ వాటి ధరల ఆధారంగా మధ్యతరగతి ప్రజలు వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు.
ఇక ల్యాప్ టాప్ అవసరం ఉండే వారంతా సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్స్( Second Hand Laptops ) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కానీ ఎలాంటి ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయాలో తెలియక కాస్త ఇబ్బంది పడుతున్నారు.
ప్రస్తుతం ఆన్ లైన్ కూడా సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్స్ అమ్మకాలు జరుగుతున్నాయి.తక్కువ ధరకు దొరికే బెస్ట్ సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ ల గురించి తెలుసుకుందాం.
HP chrome Book C640:
మంచి మెరుగైన పనితీరు, తక్కువ ధర కు అందుబాటులో ఉండే ల్యాప్ టాప్ గా ఇది ప్రాముఖ్యత పొందింది.8GB RAM తో వచ్చే ఈ HP crome Book C640 ల్యాప్ టాప్ ధర రూ.14999 గా ఉంది.ఈ ల్యాప్ టాప్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.
డిజైన్ పరంగా ఆకర్షణీయకంగా ఉంటుంది.విద్యార్థులకు చాలా అణువుగా ఉంటుంది.
లెనోవో థింక్ ప్యాడ్ T450:
తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లు ఉండే ల్యాప్ టాప్ గా( Lenovo Thinkpad T450 ) దీనిని చెప్పుకోవచ్చు.8GB RAM తో వచ్చే ఈ ల్యాప్ టాప్ ధర రూ.15578 గా ఉంది.14 అంగుళాల స్క్రీన్ కలిగి, ఇంటెల్ కోర్ ఐ5-5300 U మొబైల్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.డ్యూయల్-కోర్, ఫోర్-వే ప్రాసెసింగ్ కలిగి ఉంది.బ్యాక్ లిట్ కీబోర్డు, అధిక-నాణ్యత వెబ్ క్యామ్ తో సమర్థవంతంగా పనిచేస్తుంది.
Asus vivo Book 15:
ఈ ల్యాప్ టాప్ 1.1 GHZ క్లాక్ స్పీడ్ తో ఇంటెల్ సెలికాన్ N4020 ప్రాసెసర్ పై పని చేస్తుంది.8GB RAM+ 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23791 గా ఉంది.ఇంటిగ్రేటెడ్ UHD గ్రాఫిక్స్, యాంటీ-గ్లేర్ ఫీచర్లతో సమర్థవంతంగా పని చేస్తుంది.
సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్స్ కొనుగోలు చేయాలి అనుకునేవారు వీటిలో ఏదో ఒక దానిని కొనుగోలు చేయండి.