వారంలోని ఈ రోజులో అయ్యప్పను పూజించడం వలన కలిగే ఫలితాలు ఇవే..!

హిందూ మతంలో కొన్ని రోజులు దేవుళ్లకు అంకితం చేయబడ్డాయి.

మంగళవారం ఆంజనేయుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి ఇలా ఒక్కో దేవుడికి ఒక్కొక్క రోజు విశిష్టమైనదిగా హిందువులు భావిస్తారు.

ఆ రోజు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు.కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్న స్వామియే శరణం అయ్యప్ప స్వామిని ఏ రోజున విశేషంగా పూజించాలి.

పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఏమిటో, అలాగే ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.దేవుడు ఒక్కడైనా ఒక్కో లోక కళ్యాణం కోసం ఒక్క రూపంలో అవతరించి పూజలు అందుకుంటారు.

అలాగే అయ్యప్ప స్వామి కూడా చిన్ముద్ర రూపంలో శబరిగి కొండపై చిన్ముద్రా రూపాన్ని అధిష్టించి పూజలు అందుకుంటున్నాడు.

Advertisement

అయితే అయ్యప్ప స్వామికి బుధవారం( wednesday ) అంటే చాలా ఇష్టమట.అందుకే ఆ రోజున స్వామిని విశేషంగా పూజిస్తారు.అలాగే ఆ రోజున హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని పూజించడం వలన చాలా ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

అలాగే కుటుంబం కష్టాల్లో ఉంటే తప్పనిసరిగా అయ్యప్ప స్వామిని పూజించాలి.అలాగే ఐదుగురు అయ్యప్పలను ఇంటికి పిలిచి బిక్ష పెట్టాలి.ముందుగా మన స్థోమతకు తగ్గట్టుగా అయ్యప్పను ఆవాహనం చేసి, షోడసోపచార విధంగా పూజలు చేయాలి.

అలాగే పంచామృతంతో అభిషేకం లాంటి పూజలు చేయాలి.అలాగే వినాయకుడు వల్లి దేవా సమేత శుభమణ్యేశ్వరుడిని కూడా ఆవాహన చేసి పూజలు చేయాలి.

అంతేకాకుండా దీర్ఘ సమస్యలతో బాధపడేవారు, కోర్టు సమస్యల పరిష్కారం కాకుండా ఇబ్బంది పడే వారు కూడా స్వామిని పూజించడం వలన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
ఉల్లి, ఉసిరి క‌లిపి ఇలా తీసుకుంటే..ర‌క్త‌హీన‌త ప‌రార్‌!

ఇంకా చెప్పాలంటే బుధవారం వినాయకుడితో పాటు అయ్యప్ప స్వామికి కూడా ఎంతో ఇష్టమైన రోజు.అయ్యప్ప స్వామి అంటే విష్ణువు( Lord shiva ), అప్ప అనగా శివుడు అని అర్థం.వీరిద్దరి కలయిక వల్ల జన్మించినందున ఈ స్వామి వారిని అయ్యప్ప అని పిలుస్తారు.

Advertisement

ఇక రాక్షసులు, దేవతలు క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో అమృతాన్ని పంచడానికి సాక్షాత్తు శ్రీ విష్ణు భగవానుడు మోహిని అవతారంలో వస్తాడు.మోహిని అవతారంలో ఉన్న విష్ణువుకి, శివునికి పుట్టిన బిడ్డగా అయ్యప్పను భావిస్తారు.

దక్షిణ భారత దేశంలో అయ్యప్ప స్వామిని ఎక్కువగా పూజిస్తారు.

తాజా వార్తలు