వ్యవసాయంలో జీవ ఎరువుల ప్రాముఖ్యతలు ఇవే..!

వ్యవసాయంలో రసాయన ఎరువుల( Chemical fertilizers ) వాడకం వల్ల నేల భూసారాన్ని కోల్పోవడంతో పాటు పంట నాణ్యత దెబ్బ తింటుంది అని తెలిసింది.

వ్యవసాయంపై సరైన అవగాహన లేని రైతులు( Farmers ) పంటను సంరక్షించుకోవడం కోసం రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు.

సేంద్రియ పద్ధతిలో చేసే వ్యవసాయం గురించి అవగాహన కల్పించుకుంటే నాణ్యత గల దిగుబడి పొందడంతో పాటు భూసారాన్ని పెంచుకోవచ్చు.

ఏ పంటను సాగు చేయాలి అనుకున్న ముందుగా ఆ పంట కు సంబంధించిన కిలో విత్తనాలకు 20 గ్రాముల జీవన ఎరువుతో పాటు సరిపడా చక్కెర బెల్లం ద్రావణం కలిపి విత్తనానికి మొత్తం ఏ ఖరీతిలో పట్టేటట్లు చూసుకోవాలి.ఆ తరువాత 30 నిమిషాలు నీడలో ఆ విత్తనాలను ఆరబెట్టుకుని ఆ తరువాత పొలంలో నాటుకోవాలి.జీవన ఎరువు అంటే పశువుల ఎరువు, వానపాముల ఎరువు, ఇతర సేంద్రియ ఎరువు( Organic manure )ను కలిపితే ఈ మిశ్రమాన్ని జీవన ఎరువు అంటారు.

పొలంలో అంతర కృషి చేపట్టడానికి ముందు ఈ జీవన ఎరువులను పొలంలో చల్లుకోవాలి.

Advertisement

వేసవిలో లోతు దుక్కులు దున్నుకుంటే చీడపీడల, తెగుళ్లకు సంబంధించిన ఏవైనా అవశేషాలు ఉంటే నాశనం అవుతాయి.దీంతో రసాయన ఎరువుల వాడకం చాలావరకు తగ్గే అవకాశం ఉంది.ఆ తర్వాత నేలలో పంట వేయడానికి ముందు ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలు ఏవైనా ఉంటే పూర్తిగా శుభ్రం చేయాలి.

విత్తుకోవడానికి ముందే విత్తన శుద్ధి చేసుకుని నాటుకుంటే భూమిలో ఉండే వివిధ వైరస్, శిలీంద్రాల వల్ల మొక్కకు హాని అనేది ఉండదు.ఎప్పటికప్పుడు పొలంలో కలుపుకుని నివారించాలి, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పంట పొలంలో ఏవైనా తెగుళ్లు లేదా చీడపీడలు కనిపిస్తే వెంటనే సేంద్రీయ పద్ధతిలో ఐదు మిల్లీలీటర్ల వేప నూనెను ఒక లీటరు నీటిలో కలిపి పంటకు పిచికారి చేస్తే తొలిదశలోనే పంట సంరక్షించబడుతుంది.ఈ పద్ధతులను తొలి దశలోనే చేపడితే రసాయన ఎరువుల వాడకం చాలా వరకు తగ్గించుకోవచ్చు.

శ్రీరాముడి పాత్రకు మహేష్ పర్ఫెక్ట్ ఛాయిస్.. క్యాస్టింగ్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు