సూపర్ స్టార్ మహేష్ బాబు ( Superstar Mahesh Babu ) తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఆయన చేసిన రాజకుమారుడు సినిమా నుంచి గుంటూరు కారం సినిమా(Guntur Karam movie ) వరకు ఆయన చేసిన అన్ని సినిమాల్లో కలిపి ఆయనకు జోడిగా నటించిన కొంతమంది హీరోయిన్లు ఆయనకు అసలు సెట్ అవ్వలేదు.
వాళ్ళెవరో ఒకసారి మనం తెలుసుకుందాం.
అందులో ముఖ్యంగా రాజకుమారుడు సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రీతిజింట( Preetijinta ) కూడా తన పక్కన అంత బాగా సెట్ అవ్వలేదు.తనకంటే పెద్ద ఏజ్ ఉన్నట్టుగా ఆమె కనిపించడం ఆయన మరి కుర్రాడి లా కనిపించడంతో వీళ్ళ జోడికి పెద్దగా మార్కులైతే పడలేడు.ఇక అందుకే ఈ జోడిని మళ్ళీ రిపీట్ చేయలేదు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా సినిమాలో చేసిన అనుష్క( Anushka ) కూడా మహేష్ బాబు పక్కన అసలు సెట్ అవ్వలేదు.మహేష్ బాబు కంటే పెద్ద ఆవిడలా కనిపించడంతో ఈ సినిమా తేడా కొట్టింది.ఇక ఇదిలా ఉంటే నాని సినిమాలో అమీషా పటేల్( Ameesha Pate ) కూడా మహేష్ బాబుకు హీరోయిన్ గా ఆయన పక్కన సెట్ అవ్వలేదు ఏదో చేసింది అంటే చేసింది తప్ప ఆయనకి పర్ఫెక్ట్ జోడిగా మాత్రం అమీషా పటేల్ అనిపించుకోలేదు.
ఇక మహేష్ బాబు పర్ఫెక్ట్ జోడిగా అనిపించుకున్న వారిలో త్రిష , ఇలియానా, సమంత( Trisha, Ileana, Samantha ) లాంటివారు మొదటి ప్లేస్ లో ఉంటారు.వీళ్ళు మహేష్ బాబుకి పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు.అలాగే వీళ్లతో చేసిన సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు…
.