ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోలు కమెడియన్లు వందలకు వందలు సినిమాలు తీసేవారు.ఒకప్పుడు 100, 200 సినిమాలు తీసిన హీరోలు కూడా ఉన్నారు.
ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హిందీ మలయాళం కన్నడ ఇలా చాలా భాషల్లో 100కు పైగా సినిమాలు తీసిన హీరోలు చాలామంది ఉన్నారు.ఉదాహరణకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ అనే తీసుకోవచ్చు.
చిరంజీవి( Chiranjeevi ) ఇప్పటికీ 150 కి పైగా సినిమాలు చేయగా బాలయ్య బాబు( Balakrishna ) 100 పైన సినిమాలు తీశారు.ఇకపోతే ప్రస్తుత రోజుల్లో హీరోలు చాలా తక్కువగా మాత్రమే సినిమాలు తీస్తున్నారు.
రెండు సంవత్సరాలకు ఒక సినిమాను విడుదల చేస్తున్నారు.

కానీ ఈ జనరేషన్ హీరోల్లో కూడా తప్పకుండా కెరియర్ ముగిసేసరికి 100 సినిమాలలో నటించే హీరోలు కూడా ఉన్నారు.మరి ఈతరం హీరోలు 100 సినిమాలలో నటించగల సత్తా ఉన్న హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్( Dhanush ) ముందు వరుసలో ఉన్నారు.
ఇప్పటికే 50 కి పైగా సినిమాలలో నటించిన ధనుష్ ఈజీగానే 100 సినిమాలు దాటేస్తాడని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు విడుదల చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు ధనుష్.
అలాగే మరొక హీరో దుల్కర్ సల్మాన్.( Dulquer Salman ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈయన ఇప్పటివరకు 30కి పైగా సినిమాలలో నటించారు.అదేవిధంగా ఈ జనరేషన్ లో ఉన్న హీరోలలో ఒకే ఏడాది ఎనిమిది సినిమాలు విడుదల చేసిన ఘనత హీరో నరేష్ ది అని చెప్పవచ్చు.ఇప్పటికే 60 పైగా సినిమాలలో నటించిన హీరో నరేష్( Hero Naresh ) మిగిలిన 40 సినిమాలు కూడా పూర్తి చేస్తాడు అని అభిమానులు భావిస్తున్నారు.అలాగే సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) కూడా ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేశాడు.28 ఏళ్ళ సినిమా కెరియర్లో 100 సినిమాలను పూర్తి చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.