అన్ లాక్ 4లో కొత్త మార్గదర్శకాలు ఇవే.!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు చేస్తూ వస్తుంది.తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 4.0 కొరకు కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చింది.ఈ కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 1నుండి అమలులోకి రానున్నాయి.

ఇవి సెప్టెంబర్ 30వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.ఇక దేశవ్యాప్తంగా మరిన్ని కార్యకలాపాలను సవరిస్తునట్లు తెలిపారు.

ఈ మార్గదర్శకాలను దేశవ్యాప్తంగా దశలవారిగా అనుమతి ఇస్తూ తీసుకొచ్చింది.అన్ లాక్ 4లో మెట్రో రైలుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

ఇక పెళ్లి శుభకార్యాలకు 100 మందికి పెంచుతున్నట్లు వెల్లడించింది.అంతేకాక వివిధ కార్యకలాపాలకు సంబంధించి మరికొన్ని సడలింపులు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇక కాలేజీ, స్కూల్స్ కి అనుమతి లభించలేదు.అంతేకాక ఇంకా కొన్ని రోజులు కాలేజీ, స్కూల్స్ ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక డిజిటల్ క్లాసులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.ఇక కంటైన్‌మెంట్ జోన్స్ లో మాత్రం సెప్టెంబర్ 30వరకు లాక్ డౌన్ నిబంధలను కొనసాగించాలని వెల్లడించింది.

కంటైన్‌మెంట్ జోన్స్ లోని ప్రజలు అనవసరంగా బయటికి వస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.ఇక సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అంగీకారం తెలిపింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అంతేకాకుండా వినోదాలను పంచె కార్యక్రమాలకు, క్రీడాలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు.ఇక సినిమా థియేటర్లకు, పార్క్ లకు ఇంకా అనుమతి లభించలేదు.

Advertisement

ఇక అంతర రాష్ట్ర రవాణాకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.అంతేకాదు వృద్దులకు, చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మొబైల్ సేతు ద్వారా వైద్యం అందించడానికి అంగీకారం తెలిపింది.

తాజా వార్తలు