రూ.70 వేల కంటే తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఇటీవల పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో పెట్రోల్ తో నడిచే బైక్ లను కొనుగోలు చేయడం చాలావరకు తగ్గింది.

పెట్రోల్ ఖర్చులను భరించలేక చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రభుత్వాలు కూడా పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్( Electric Vehicles ) కొనుగోలును ప్రోత్సహించింది.ఇందుకోసం అనేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తోంది.

అయితే మార్కెట్ లో ఇప్పటికే అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కొత్తగా మార్కెట్ లో ప్రవేశపెడుతున్నాయి.తక్కువ ధరల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

రూ.70 వేలలోపే అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో లభిస్తున్నాయి.బ్యాటరీ ఎలక్ట్రిక్ లో ఈవీ స్కూటర్ ( EV scooter )రూ.68,900కే లభిస్తోంది.దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు వస్తుంది.

Advertisement

ఇక ఒకినావా లైట్( Okinawa Light ) పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.ఈ స్కూటర్ ధర రూ.67 వేలుగా ఉంది.ఇది కూడా 60 కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది.

ఇక ఒకినావా కంపెనీలోనే ఆర్ 30 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది.ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ కూడా 60 కిలోమీటర్ల వరకు వస్తూ ఉంటుంది.

ఒకినావా ఆర్ 30 మోడల్( Okinawa R30 model ) స్కూటర్ ధర రూ.62 వేలుగా ఉంది.ఇక ఎమో కంపెనీ జాంటీ పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది.ఈ స్కూటర్ ధర రూ.63 వేలుగా ఉంది.ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బైక్ 75 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.ఇక విన్ పేరుతో ఉన్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.55,555గా వస్తుంది.దీని రేంజ్ 68 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

అలాగే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఆప్టిమా పేరుతో స్కూటర్ ను తీసుకొచ్చింది.దీని ధర రూ.67 వేలు కాగా.ఒక్కసారి ఛార్జ్ చేస్తే 82 కిలోమీటర్ల వరకు వస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దీని వేగం గండకు 45 కిలోమీటర్లుగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు