భారతీయులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో వేల సంఖ్యలో స్థిరపడ్డారు.అయితే ప్రపంచంలో ఉండే కొన్ని దేశాలలో ఒక్క భారతీయుడు కూడా కనిపించని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా ప్రపంచంలో ఉండే దేశాలలో 195 దేశాలలో భారతీయులు నివసిస్తున్నారు.
కానీ భారతీయులు నివసించిన దేశాలు కూడా ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం.
పాకిస్తాన్: భారతదేశానికి దాయాది దేశమైన పాకిస్తాన్( Pakistan ) లో ఒక్క భారతీయుడు కూడా నివసించడం లేదు.దీనికి గల కారణం మన అందరికీ తెలిసిందే.భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్లనే పాకిస్తాన్ లో భారతీయులు ఎవరు నివసించడం లేదు.పాకిస్తాన్లో భారత దౌత్యవేత్తలు, ఖైదీలు తప్ప భారతదేశానికి చెందిన వారు కనిపించరు.
వాటికన్ సిటీ: యూరోపియన్ దేశం అయిన వాటికన్ సిటీ( Vatican City ) ప్రపంచంలోనే అతి చిన్న దేశం.దేశం కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.ఈ దేశంలో ఒక్క భారతీయుడు కూడా నివసించడం లేదు.వాటికన్ సిటీలో నివసించే ప్రజలు రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు.అయితే ఈ మతాన్ని అనుసరించే క్రైస్తవులు భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం.
తువాలు: ఓషియానియా ఖండం లోని ఒక ద్వీపంలో ఈ తవాలు దేశం ఉంది.ఈ తువాలు( tuvalu ) దేశాన్ని ఎల్లిస్ దీవులు అని కూడా అంటారు.ఈ దేశం ఆస్ట్రేలియాకు ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంది.ఈ దేశంలో పదివేల జనాభా ఉంది.ఈ దేశానికి 1978లో స్వాతంత్రం వచ్చింది.
ఇక్కడ భారతీయులు ఎవరు నివసించరు.
బల్గేరియా: ఆగ్నేయ ఐరోపాలో బల్గేరియా దేశం( Bulgaria ) ఉంది.ఈ దేశం ప్రకృతి అందాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ నివసించే ప్రజలు అధికంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు.
భారతదేశానికి చెందిన దౌత్యవేత్తలు తప్ప భారతీయులు ఎవరు ఇక్కడ నివసించరు.
శాన్ మారినో: ఐరోపాలోని శాన్ మారినో ( San Marino )ఒక రిపబ్లిక్ దేశం.ఈ దేశంలో భారతీయ టూరిస్టులు కనిపిస్తారు కానీ ఒక్క భారతీయుడు కూడా ఇక్కడ నివసించడు.