ప్రతీ వారం బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసే ఘట్టం నామినేషన్స్ ప్రక్రియ.కంటెస్టెంట్స్ ఎవరిని నామినేట్ చెయ్యబోతున్నారు?, ఏ కారణం తో చెయ్యబోతున్నారు.వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు జరగబోతున్నాయి, ఇలాంటివన్నీ చాలా ఆసక్తిగా ఉంటాయి.గత వారం ప్రశాంత్ మరియు శివాజీ( Shivaji ) తప్ప దాదాపుగా అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు.
కానీ యావర్ ఏవిక్షన్ పాస్ ఇవ్వడం వల్ల ఎలిమినేషన్ లేదని నాగార్జున ప్రకటించాడు.కానీ ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా ‘ఏవిక్షన్ పాస్’ ( Eviction Pass )మీద కూడా ఈ వారం మొత్తం గేమ్స్ జరగబోతున్నాయి.మరి యావర్ పోగొట్టుకున్న ఈ ఏవిక్షన్ పాస్ మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాడా?, లేదా వేరే కంటెస్టెంట్ ఎవరైనా ఈ ఏవిక్షన్ పాస్ ని కైవసం చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.ఈ ఏవిక్షన్ పాస్ కోసం పాపం రతికా తెగ ప్రయత్నిస్తుంది.
ఇక పోతే ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది.ఈ ప్రక్రియ లో అమర్ దీప్, శివాజీ, యావర్ , ప్రశాంత్, గౌతమ్, అర్జున్, రతికా మరియు అశ్వినీ నామినేట్ అయ్యారు.కెప్టెన్ అయిన కారణం గా ప్రియాంక నామినేట్ అవ్వలేదు.
ఆమెతో పాటుగా శోభా శెట్టి కూడా నామినేట్ అవ్వలేదు.సంచాలక్ గా ఫెయిల్ అయ్యినందుకు ఆమెకి ఎక్కువ నామినేషన్స్ పడుతాయి అనుకున్నారు అందరూ.
కానీ ఆమెతో పాటు సంచాలక్ గా వ్యవహరించిన పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లోకి వచ్చాడు కానీ, శోభా శెట్టి మాత్రం నామినేషన్స్ లోకి రాలేదు.దీని వెనుక బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా, శోభా శెట్టి( Shobha Shetty ) ని మళ్ళీ ఉద్దేశపూర్వకంగానే నామినేట్ చేసారా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం అశ్వినీ మరియు రతికా డేంజర్ జోన్ లో ఉన్నారు.
డబుల్ ఎలిమినేషన్ లో వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.కానీ ఏవిక్షన్ పాస్ ద్వారా ఒకరు సేవ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.ఈ ఏవిక్షన్ పాస్ మళ్ళీ యావర్ సొంతం చేసుకుంటే కచ్చితంగా అతను రతికా నే ఎలిమినేట్ చేస్తాడు.
కానీ యావర్ కాకుండా అమర్ దీప్ గెలుచుకుంటే మాత్రం ఎవర్ని సేవ్ చేస్తాడు అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్.ఎందుకంటే అమర్ దీప్ కి ఇద్దరితో మంచి బాండింగ్ ఉంది.
రతికా తనకి గత వారం లో కెప్టెన్సీ టాస్కు అప్పుడు వెన్నుపోటు పొడిచింది కాబట్టి అమర్ దీప్ ఆమె పై ప్రతీకారం తీర్చుకుంటాడా?, లేకపోతే ఆమెని సేవ్ చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.ఒకవేళ అమర్ దీప్ కి కాకుండా వేరే కంటెస్టెంట్ కి ఈ పాస్ వస్తే పరిస్థితి ఏమిటి అనేది కూడా చూడాలి.