5G Phones : అదిరిపోయే ఫీచర్‌లతో అతి తక్కువ ధరలలోనే 5జీ ఫోన్స్ ఇవే

టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది.భారత దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.ప్రస్తుతం దేశంలో ఎంపిక చేసిన మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే 5జీ సేవలు ఉన్నప్పటికీ క్రమంగా దేశమంతటా అవి విస్తరించనున్నాయి.5జీ సేవలు ద్వారా ఇంటర్‌నెట్ వేగం బాగా పెరుగుతుంది.అయితే 5జీ సేవలు కావాలంటే అందుకు సంబంధించి మన వద్ద 5జీ టెక్నాలజీ సపోర్ట్ చేసే ఫోన్లు ఉండాలి.ప్రస్తుతం కొన్ని ఫోన్లలో 5జీ సేవలు ఉన్నాయి.

 These Are The Cheapest 5g Phones With Amazing Features , 5g Phones , Phones, Te-TeluguStop.com

దీంతో ఎక్కువ మంది 5జీ సపోర్ట్ చేసే ఫోన్ల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు.అయితే ఖరీదైన ఫోన్లలోనే కాకుండా అందుబాటు ధరల్లో, అత్యాధునిక ఫీచర్లతో 5జీ ఫోన్లు మార్కెట్‌లో ఉన్నాయి.

వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

Telugu Latest, Smart Phone, Ups-Latest News - Telugu

సాంసంగ్ గెలాక్సీ M13 5జీ ఫోన్ కేవలం రూ.13,999కే లభిస్తుంది.ఇందులో MediaTek డైమెన్సిటీ 700 SoC ఉంటుంది.50MP డబుల్ రియర్ కెమెరాలు ఉంటాయి.5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లభిస్తుంది.15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.రెండో ఫోన్ పోకో ఎం4 సిరీస్ డైమెన్సిటీ 700/810 SoC ప్రాసెసర్‌తో వస్తుంది.ఇందులో 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు ఉంటాయి.5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.దీని ధర రూ.12,999కి లభిస్తుంది.ఇక మూడో ఫోన్ iQOO Z6.ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 SoC ఓఎస్ ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది.దీనిలో 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి.దీని ధర రూ.14,999కే ఉంది.ఇక నాలుగో ఫోన్ పరిశీలిస్తే వివో టీ1 5జీ ఫోన్.ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoC ఓఓస్‌తో వస్తుంది.120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది.దీనిలో 50 ఎంపీతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉంటాయి.దీని ధర భారత్‌లో రూ.15,990.మరో 5జీ ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ.ఇందులో స్నాప్‌డ్రాగన్ 750G SoC ప్రాసెసర్ ఉంటుంది.ఇది 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ కలిగి ఉంది.ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు.50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉంటాయి.ఇది రూ.15,999కే లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube