మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు అవకాశాలు వరుసగా క్యూ కడితే మరికొన్నిసార్లు అసలు అవకాశాలు లేక సెలబ్రిటీలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి.అంతేకాకుండా ఇంతకుముందు ఆఫర్లు బాగా వచ్చి సడన్గా ఆగిపోవడంతో ఇతర ఇండస్ట్రీలకు వెళ్లి స్థిరపడిన సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు.
ఇంకొందరు అటు ఇండస్ట్రీలో తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కలిపి సినిమాలలో నటిస్తున్న వారు చాలామంది ఉన్నారు.మరి టాలీవుడ్( Tollywood ) లో సరైన అవకాశాలు లేక ఇతర సినిమా ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సెటిల్ అయిన ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ( Aishwarya Rajesh )తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఆమెకు తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది.ప్రస్తుతం ఈమె అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.టాలీవుడ్ హీరో కమెడియన్ నటుడు సునీల్ కి ప్రస్తుతం తెలుగుతో పోల్చుకుంటే తమిళంలోనే ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఇంకో కొద్ది రోజులు ఆగిన తర్వాత హీరో సునీల్( Sunil ) పూర్తిగా తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అలాగే తెలుగు డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ రెడ్డి( Vaibhav Reddy ) తెలుగులో కలిసి సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కకపోవడంతో తమిళసినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడే ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.కేవలం వీరు మాత్రమే కాకుండా జయం రవి, విశాల్,జీవన్, శ్రీరామ్, అతిథి హైదరి లాంటి చాలామంది తెలుగులో సరైన అవకాశాలు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు.