వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ కు చేరే 4 జట్లు ఇవే.. జోస్యం చెప్పిన ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం..!

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ ( ODI World Cup )టోర్నీ టైటిల్ కైవసం చేసుకోవడానికి పలు దేశాలు కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి.ఈ టోర్నీకి కేవలం రెండు నెలల సమయం ఉండడంతో టోర్నీలో పాల్గొనే దేశాలు తమ జట్ల ఆటగాళ్ల ఎంపికలో నిమగ్నమయ్యాయి.

 These Are The 4 Teams That Will Reach The Semifinals Of The Odi World Cup.. The-TeluguStop.com

అయితే ఇంకా టోర్నీ ప్రారంభమే కాలేదు.అప్పుడే కొంతమంది మాజీ క్రికెట్ నిపుణులు సెమీఫైనల్ చేరే జట్లు ఇవే అంటూ జోష్యం చెబుతున్నారు.

తాజాగా ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ సెమీఫైనల్ కు చేరే జట్లు ఏమో చెప్పేశాడు.ఇంతకు ఆ మాజీ ప్లేయర్ ఎవరంటే ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్.

Telugu Teams, Australia, England, Glenn Mcgrath, Latest Telugu, Odi Cup, Pakista

అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.అక్టోబర్ ఐదు నుండి భారత వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది.2019 వరల్డ్ కప్ రన్న రప్ న్యూజిలాండ్- డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్( England ) మధ్య జరిగే మ్యాచ్ తో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.

Telugu Teams, Australia, England, Glenn Mcgrath, Latest Telugu, Odi Cup, Pakista

నవంబర్ 15, 16న జరిగే తొలి, రెండో సెమీ ఫైనల్ కి చేరే నాలుగు జట్లు ఏవో తేల్చి చెప్పేశాడు.భారత్ తో సహా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు కచ్చితంగా సెమీఫైనల్ కు చేరే అవకాశం ఉందని మెక్ గ్రాత్( Glenn McGrath ) పేర్కొన్నాడు.ఇతని అంచనాల ప్రకారం సొంత దేశం లో టోర్నీ జరుగుతూ ఉండడంతో భారత్ కచ్చితంగా సెమి ఫైనల్ చేరుతుంది.

ఆస్ట్రేలియా జట్టుకు సెమీఫైనల్ కు చేరే సత్తా ఉంది.ఇకపోతే పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు బాగానే ఆడుతున్నాయని తెలిపాడు.ఇతను ఎంచుకున్న నాలుగు జట్లలో భారత్, పాకిస్తాన్ ఎప్పటినుంచో చిరకాల ప్రత్యర్థులు.మరొకపక్క ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు అంతర్జాతీయ క్రికెట్ తొలినాళ్ల నుంచే చిరకాల ప్రత్యర్థులు.

భారత జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 14న పాకిస్తాన్ తో, అక్టోబర్ 29న ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది.మెక్ గ్రాత్ చెప్పిందే జరిగిందంటే ప్రత్యర్థుల మధ్య జరిగే పోరు ఎంతో ఉత్కంఠ భరితంగా ఉండనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube