బ్లాక్ బస్టర్ హిట్స్‌ను కొద్దిలో మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్స్‌.. ఎవరంటే..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్క మంచి అవకాశం వస్తే చాలు స్టార్ యాక్టర్ గా సెటిల్ కావచ్చు.

ఒక్క హిట్ వస్తే ఆ క్రేజీ ద్వారా మరిన్ని అవకాశాలు పొందవచ్చు.

ఒక మంచి పొజిషన్‌కి వచ్చాక అవకాశాలు నటీనటులను వెతుక్కుంటూ వస్తుంటాయి.అయితే యాక్టర్స్ కెరీర్ కాపాడుకోవడానికి వీటిలో కొన్నిటిని రిజెక్ట్ చేస్తుంటారు, కొన్నిటిని ఒప్పుకుంటారు.

జడ్జి చేసే విషయంలో ఫెయిల్ కావడంవల్ల ఒక్కోసారి వారికి ఫ్లాప్స్ వస్తుంటాయి.కొన్నిసార్లు మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అవుతాయి.

మంచి ఛాన్సులు వచ్చినప్పుడు కొందరు చిన్న కారణాలకే వాటిని రిజెక్ట్ చేస్తుంటారు.ఒక్కోసారి ఆ మంచి ఛాన్స్ లు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి.

Advertisement

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు, ఏమేమి ఆఫర్లను కోల్పోయారు తెలుసుకుందాం.

శ్రీ సుధా

( Shri Sudha ) నటి శ్రీ సుధా అర్జున్ రెడ్డి సౌందర్య అవును వంటి సినిమాల్లో నటించి బాగా పేర్చుకుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ కి ఇండస్ట్రీ హిట్ బాహుబలిలో( Bahubali ) అవంతిక ఫ్రెండ్‌ రోల్ చేసే ఛాన్స్ వచ్చిందట.అయితే ఆ సమయంలో ఆమెకు హెల్త్ బాగోలేదట.

కాలికి వాపు కూడా వచ్చినట్టు.అందువల్ల ఈ ఆఫర్‌ను ఆమె రిజెక్ట్ చేసింది.

కానీ ఇంత పెద్ద మూవీలో భాగమయ్యే మంచి అవకాశాన్ని కోల్పోయినందుకు చాలా బాధపడింది.

పదేళ్లలో నాకు నచ్చిన సినిమా అదే... హీరో నాని కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ ను రెండు రకాలుగా దెబ్బ తీస్తున్న టాలీవుడ్ హీరోలు...

అజయ్ ఘోష్

( Ajay Ghosh ) "సత్య" సినిమాలో విలన్ రోల్ అజయ్ ఘోష్( Ajay Ghosh ) కి ఇవ్వాలని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనుకున్నారు.కొన్ని కారణాలవల్ల అతను ఈరోజు కోల్పోవలసి వచ్చింది.ఈ క్యారెక్టర్ వేరే నటుడు పోషించాడు.

Advertisement

అయితే దీన్ని కోల్పోయిన అజయ్ ఘోష్ మాత్రం తన టాలెంట్ తో చాలా మంచి పొజిషన్ కి చేరుకున్నాడు.

రావు గోపాల్ రావు

( Rao Gopal Rao ) హాస్యబ్రహ్మ జంద్యాల దర్శకత్వంలో అహ! నా పెళ్ళంట సినిమా( Aha na pellanta movie ) వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సంగతి తెలిసిందే.ఈ మూవీ 16 లక్షలు పెట్టి తీస్తే 5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్ర కంటే కోట శ్రీనివాసరావు పాత్ర బాగా హైలైట్ అయింది.

పిసినారి లక్ష్మీపతిగా కోట శ్రీనివాస రావు అదరగొట్టేసాడు నిజానికి ఈ పాత్రలో రావు గోపాల్ రావుని నటింపజేయాలని అనుకున్నారట.కానీ జంధ్యాల మాత్రమే కోట శ్రీనివాసరావు అయితేనే బాగుంటారు అని పట్టుబట్టి మరీ అతనినే నటింపజేశారు.

ఇక బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప సినిమాలో విలన్ రోల్ విజయ్ సేతుపతికి వచ్చినట్లే వచ్చి మిస్ అయిపోయింది.

తాజా వార్తలు