Tollywood Movies : ఈ మూడు సినిమాలు డేట్స్ మార్చుకుంటూ పోతున్నాయి..అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి

దాదాపు రెండు, మూడు ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో ఎవరు చెప్పలేని పరిస్థితి ఇండస్ట్రీలో నెలకొని ఉంది.

వారేమీ చిన్న హీరోలు కాదు జరుగుతున్నవి చిన్న సినిమాలు అంతకన్నా కాదు.

అలాగే ఇప్పటికే పలుమార్లు డేట్స్ అనౌన్స్ చేసి వాటిని పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వెళుతున్నారు.ఇది ఇలాగే ముందుకు వెళితే ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఆ దర్శకుడికి నిర్మాతకు కూడా తెలియదు.

ప్రేక్షకులకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వాలని వీరు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు.మరి మూడు ముక్కలాట లాగా అది సాగుతున్న ఈ మూడు సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి ప్రస్తుతం ఆ సినిమాల అప్డేట్ ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కల్కి 2898 AD

కల్కి సినిమాకి( Kalki Movie ) సంబంధించి ఐదేళ్లుగా స్క్రిప్ట్ వర్క్ చేసి మరి సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు నాగ్ అశ్విన్. అయితే మే 9న ఈ సినిమా విడుదల చేయాలని ఖచ్చితంగా కంకణం కట్టుకొని మరీ అనౌన్స్ చేశాడు.అయినా కూడా ఇప్పటికి ఈ సినిమా విడుదలవుతుంది అంటే ప్రభాస్ తో( Prabhas ) పాటు ఆయన అభిమానులు నమ్మడం లేదు.

Advertisement

ఎందుకంటే ఎన్నికల హడావిడి మొదలైంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయితే చాలా కష్టం అవుతుంది అనుకుంటున్నారు.దాంతో నాగ్ అశ్విన్ కూడా కాస్త రిలాక్స్ అయిపోయి మళ్లీ సినిమాను చెక్కే పనిలో పడ్డాడు.

గేమ్ చెంజర్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వస్తుంది ఈ గేమ్ చేంజర్ సినిమా.( Game Changer Movie ) ఈ సినిమా ఎలా జరుపుకుంటుందో ఎక్కడ జరుపుకుంటుందో అనే విషయాలను ఎవరు అంచనా వేయలేకపోతున్నారు.ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు.

గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ ఫాన్స్ చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

పుష్ప 2

ఈ సినిమా ఆగస్టున విడుదల చేస్తామని ఇప్పటికే సుకుమార్ అనౌన్స్ చేశాడు.అల్లు అర్జున్( Allu Arjun ) ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు.అయితే ఇంకా రెండు నెలల షూటింగ్ పెండింగ్ ఉన్న కారణంగా అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదలవుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

పైగా ఫ్యాన్ ఇండియా సబ్జెక్టు సినిమాకి ముందు రెండు నెలలపాటు ఖచ్చితంగా ప్రమోషన్స్ చేసుకోవాలి.మరి ఈ మాత్రం లెక్కలు వేసుకోకుండా మన లెక్కల మాస్టారు సినిమా తీయడు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆగస్టులో విడుదల అయ్యే అవకాశం లేదు.

Advertisement

తాజా వార్తలు