యూఎస్‌లోని ప్రజలు నిన్న క్రిస్మస్ పండుగను( Christmas festival ) ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.ఇప్పుడు కొత్త సంవత్సరం కోసం సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ దేశంలోని కొన్ని ప్రాంతాల్లోకి హాలిడే సందర్భంగా వెళ్లాలంటేనే చాలా భయం కలుగుతోంది ఎందుకంటే హింసాత్మక ముప్పును వారు ఎదుర్కొంటున్నారు.ఇటీవల కాలంలో భయాందోళనలకు గురిచేసే కాల్పులు, ఇతర నేరాల ఘటనలు అనేకం జరుగుతున్నాయి.
అలాంటి ఘటనే కొలరాడోలోని సిటాడెల్ మాల్‌లో( Citadel Mall in Colorado ) ఆదివారం చోటుచేసుకుంది.ఒక సాయుధుడు కాల్పులు జరపగా ఒక వ్యక్తి మృతి చెందాడు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.కాల్పులు జరిపిన వ్యక్తి ఉద్దేశ్యం, గుర్తింపు ఇంకా తెలియరాలేదు.ఈ నేపథ్యంలో హాలిడే సీజన్‌లో యూఎస్‌లోని నగరాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
వివింట్ అనే స్మార్ట్-హోమ్ సెక్యూరిటీ కంపెనీ( A smart-home security company ) పరిశోధన చేసిన ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ప్రయత్నించింది.వివింట్ యుఎస్‌లోని 50 అతిపెద్ద నగరాలకు వాటి క్రైమ్ రిస్క్ ఆధారంగా ర్యాంక్ ఇచ్చింది.నేర ప్రమాదాన్ని కొలవడానికి కంపెనీ వివిధ డేటా వనరులను ఉపయోగించింది.వివింట్ ఎఫ్‌బీఐ, గూగుల్ ట్రెండ్స్, ఎయిర్‌బీఎన్‌బీ, నైబర్‌హుడ్ వాచ్, NICB వంటి మూలాధారాల నుంచి డేటాను ఉపయోగించి యూఎస్ నగరాల్లో నేర ప్రమాదాన్ని అంచనా వేసింది.
ప్రాపర్టీ క్రైమ్ రిపోర్ట్‌లు, హాలిడే సెక్యూరిటీ సెర్చ్‌లు, ఎయిర్‌బీఎన్‌బీ సెక్యూరిటీ ఫీచర్లు( Holiday Security Searches, Airbnb Security Features ), నైబర్‌హుడ్ వాచ్ గ్రూప్‌లు, వాహన దొంగతనాలను పరిగణనలోకి తీసుకుంది.
ప్రతి నగరం 0 నుంచి 100 వరకు రిస్క్ స్కోర్‌ను పొందింది, అధిక స్కోర్‌లు అధిక నేర ప్రమాదాన్ని సూచిస్తాయి.ఇది సెలవుల సమయంలో తలెత్తే ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి, వాటి కోసం సిద్ధం చేయడానికి ప్రజలకు సహాయపడుతుంది.ఇక ఏయే నగరానికి ఎక్కువ రిస్కుందో స్కోర్ ప్రకారం తెలుసుకుందాం.
– సెయింట్ లూయిస్: 62.49 – నెవార్క్, డెలావేర్: 62.46 – సాల్ట్ లేక్ సిటీ: 60.20 – డెన్వర్: 59.46 – సీటెల్: 59.34 – బర్లింగ్టన్, వెర్మోంట్: 58.64 – రట్లాండ్, వెర్మోంట్: 58.56 – అట్లాంటా: 58.05 – మిన్నియాపాలిస్: 57.20 – పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్: 56.95
పైన పేర్కొన్న రిస్కులను బట్టి ఈ నగరాలను వీలైనంతవరకు అవాయిడ్ చేయడం మంచిది.లేదంటే ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు.