టీడీపీ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మద్దతు తెలిపారు.బండారు మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పేం లేదని చెప్పారు.
అయితే మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో బండారును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.కాగా గతంలో టీడీపీ నేతలపై అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు ఎన్నోసార్లు చేశారని చింతమనేని ఆరోపించారు.
వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పుగా కనిపించలేదు కానీ ఇప్పుడు రోజాపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పుగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.ఈ క్రమంలో ముందుగా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం పోలీసుల సాయంతో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని విమర్శలు గుప్పించారు.టీడీపీ నేతలపై కక్ష పూరితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.