నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు అవుతోంది.2014 ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవిని చేపట్టారు.ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.అయితే జనాకర్షణ నేతగా మాత్రం ఎదగలేకపోయారు.వాక్ఛాతుర్యం లేకపోవడం… ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయలేకపోవడం వంటి అంశాలు నారా లోకేష్ పొలిటికల్ కేరీర్‌కు మైనస్‌గా మారాయి.2019 జనరల్ ఎలక్షన్స్‌లో నారా లోకేష్ ప్రచారం చేసిన చోట్ల టీడీపీ ఓటమి పాలైంది.దీంతో అతని నాయకత్వ సామర్థ్యంపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేకుండాపోయింది.చివరికి తాను పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలోనూ చినబాబు పరాజయం పాలయ్యాడు.దీంతో లోకేష్ పొలిటికల్ కేరీర్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
చినబాబు ఎన్నికల ప్రచారానికి వస్తే ఖర్చు తప్ప ప్రయోజనం శూన్యం అన్న స్థాయికి నేతలు వచ్చారంటే లోకేష్‌కు సమకాలీన రాజకీయాలపై ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు.
లోకేష్ ఓ టీంను ఏర్పాటు చేసుకున్నాడని.వారు చెప్పినట్లుగానే నడుచుకుంటాడని.
సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేదని టీడీపీ నేతలే చెబుతుంటారు.తండ్రి చంద్రబాబు అపర చాణక్యం.
తాత ఎన్టీఆర్‌కు ఉన్న భాష పరిజ్ఞానం చినబాబుకు వంట బట్టలేదు.ఎంతసేపు జగన్‌ను నేరుగా విమర్శించి రాజకీయంగా ఎదగాలని చినబాబు అనుకుంటున్నాడు తప్పా.
మరో మార్గంలో పయణించాలన్న ఆలోచన లోకేష్‌లో కనిపించడం లేదు.జగన్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా.
ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం చేసిన దాఖలాలు లేవు.

అడపాదడపా క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రెస్ మీట్లకే పెద్దబాబు, చినబాబు పరిమితమవుతున్నారు.2019 సాధారణ ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్.మరోసారి అదే నియోజకవర్గం నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు సమాచారం.
ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.అందులో భాగంగానే చినబాబు అప్పుడప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
పోయిన చోటనే వెతుక్కోవాలన్న సామెతను పరిగణలోకి తీసుకోవడం మంచిదే.

రాజధాని అమరావతి, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇప్పటికే మంగళగిరి నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం వంటి అంశాలు తనుకు కలిసి వస్తాయని చినబాబు లెక్కలు వేసుకొని మరీ బరిలో దిగుతున్నట్లు సమాచారం.అయితే మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి భంగపడ్డ లోకేష్. రెండోసారి మంగళగిరి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటాడో లేదో చూడాలంటే మరో రెండున్నరేళ్లు వేచి చూడాల్సిందే.చివరగా ఓ మాట.తండ్రి బాటల్లో రాజకీయాల్లో వచ్చిన జగన్, కేటీ ఆర్ మాదిరి మాస్ లీడర్లుగా ఎదగాలంటే లోకేష్ రాజకీయంగా మరింత రాటు దేలాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.