పాకిస్తాన్ మీడియాలో ఇక ఇమ్రాన్‌ఖాన్ కనిపించే అవకాశమే లేదు

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్( Imran Khan ) ఆంక్షల వలయంలో ఉన్నారు.మే 9న ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

 There Is No Chance Of Imran Khan Appearing Pakistani Media Details, Imran Khan ,-TeluguStop.com

ఆయన అరెస్ట్‌కు నిరసనగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.దీంతో ఆయన పార్టీపై అక్కడి ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఇమ్రాన్‌ఖాన్‌ అనేక ప్రధాన ప్రసార మాధ్యమాల్లో( Media ) కనిపించకుండా, ఆయన పేరు వినిపించకుండా ఆంక్షలు విధిస్తోంది.హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌ను ఎక్కడా చూపించవద్దని, ఆయన పేరు వినిపించకూడదని మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

Telugu Imran Khan, Pakistan, Pakistanpm-Latest News - Telugu

పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ అక్కడి మీడియా సంస్థలకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.విద్వేషాన్ని వ్యాప్తి చేసేవారు, అల్లరి మూకలు, వారికి సహకరించేవారిని మీడియా నుంచి పూర్తిగా నిర్మూలించండి అని పేర్కొంది.ఇమ్రాన్ ఖాన్ పేరుతో పాటు ఆయన ఫొటోలు మీడియాలో చూపించవద్దని ఆదేశించింది.నిబంధనలు ఉల్లంఘిస్తే మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ నిర్ణయంతో ఇక నుంచి పాకిస్తాన్ మీడియాలో( Pakistan Media ) ఇమ్రాన్ ఖాన్ ఫొటోలు కనిపించవని, ఆయన పేరు కూడా వినిపించదని తెలుస్తోంది.ఈ నిర్ణయంపై నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Telugu Imran Khan, Pakistan, Pakistanpm-Latest News - Telugu

అయితే తమ పార్టీని అణిచివేసేందుకు ప్రభుత్వం అల్లర్లను ఒక చాకుగా చూపుతోందని మే 9న ఒక ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.దీంతో ఆయనపై మీడియాలో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తంది.దీంతో తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు.ప్రభుత్వ ఆదేశాలతో ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతిచ్చే మీడియా ఛానెల్స్ కూడా ఆయన పేరు ప్రస్తావించడం లేదు.

అయితే పాకిస్తాన్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.దీంతో ఆయన వ్యాఖ్యలకు కూడా వ్యూయర్ షిప్ అధికంగా ఉంటుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube