తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీచ్ లో భయం కనిపిస్తోందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు.బీఆర్ఎస్ దగ్గరున్న డబ్బులు చూసి నేతలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
మొన్నటి వరకు కాంగ్రెస్ తిట్టిన కేసీఆర్ ఇప్పుడు పొగుడుతున్నారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా కేసీఆర్ వ్యవహారించవద్దని బూర సూచించారు.
మోదీ పనితనంతో బొగ్గు ఉత్పత్తి పెరిగిందన్నారు.అభివృద్ధి కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.







