యూత్ లో మ్యూజిక్ పట్ల విపరీతమైన క్రేజ్ వుంది.. నిదర్శనమిదే!

సంగీతం… బండరాయినైనా కదిలించగలదు.ఇక దానిని ఇష్టపడనివారు ఈ భూమ్మీద ఎవరైనా ఉంటారా? జీవం లేని జీవాలు కూడా సంగీతానికి ( Music ) కదులుతాయి.అయితే నిన్న మొన్నటి వరకు జనాలు కేవలం మ్యూజిక్‌ను వినడం వరకే పరిమితం అయ్యేవారు.కానీ ఇపుడు అలా కాదు.పలు ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌( Online Streaming ) సర్వీస్‌ల ద్వారా సంగీతంపై అవగాహన ఏర్పరచుకుని ఆ అవగాహనతో యువ సంగీత ప్రేమికులు, శ్రోతలు యాపిల్‌ మ్యూజిక్, స్పాటిఫై, ఆడియో మ్యాక్‌ మొదలైన స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మ్యూజిషియన్‌లుగా( Musicians ) కూడా అవతారమెత్తుతున్నారు.ఈ క్రమంలో దీన్నే కెరీర్ గా ఎంచుకుంటే లైఫ్‌లో సెటిల్ అయినవారు కూడా లేకపోలేదు.

 There Is A Huge Craze For Music Among The Youth Details, Music, Online Streaming-TeluguStop.com
Telugu Apple Music, Mac, Ifpi, Listeners, Music, Musicians, Spotify, Platms-Late

అవును, శ్రోతలు సంగీతం వినే విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా మార్పు వచ్చింది.ఇంటర్నెట్‌ యూజర్‌లను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ది ఫోనోగ్రాఫిక్‌ ఇండస్ట్రీ(ఐఎఫ్‌పీఐ) చేసిన సర్వేలో తేలింది ఏమిటంటే… 78 శాతం మంది స్ట్రీమింగ్‌ సర్వీసుల ద్వారా మ్యూజిక్‌ను వింటున్నట్లు తెలిసింది.అందులో యువతరమే( Youth ) ఎక్కువ కావడం విశేషం.అయితే యువతరంలో కొంతమంది సంగీతాన్ని విని ఎంజాయ్‌ చేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదు.తమను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదికలుగా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను వాడుకుంటున్నారు.

Telugu Apple Music, Mac, Ifpi, Listeners, Music, Musicians, Spotify, Platms-Late

అందుకే ముఖ్యంగా ఈ యువతరం ఏం వింటుంది? దేనికి కనెక్ట్‌ అవుతుంది? అనేదానిపై మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ అనేవి ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.ఇపుడు ఫిల్మ్‌ మ్యూజిక్‌ మాత్రమే కాదు ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌( Independent Music ) వినడానికి కూడా శ్రోతలు చాలా ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.అది మాత్రమే కాదు, ఇపుడు ఆల్బం సాంగ్స్ కి వున్న క్రేజ్ అంతాఇంతా కాదు.

ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌తో వివిధ మాధ్యమాల ద్వారా తమను తాము నిరూపించుకునే అవకాశం యువ కళాకారులకు ఎంతైనా వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube