సుశాంత్ హీరోగా సక్సెస్ కాకపోవడానికి 5 కారణాలు ఉన్నాయి అవేటంటే..?

అక్కినేని నాగేశ్వర రావు ఒకప్పుడు టాప్ హీరోగా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు అనే చెప్పాలి.

ఎన్టీయార్ తరువాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆ తరం హీరో నాగేశ్వర రావు ఒక్కరే అని చెప్పాలి.

ఇక ఆయన తరం తరువాత ఆయన చిన్న కొడుకు అయిన నాగార్జున ఇండస్ట్రీ కి వచ్చారు.నాగర్జున మొదట్లో లవ్ స్టోరీస్ చేస్తూ మంచి హీరో గా గుర్తింపు పొందారు ఆ తరువాత అన్ని రకాల సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో కింగ్ నాగార్జున గా పేరు తెచ్చుకున్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది ఇక అక్కినేని మూడవ తరం గా ఇండస్ట్రీ కి వచ్చిన సుమంత్, సుశాంత్ ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి.ఎందుకంటే వాళ్ళు హీరోలుగా నిలదొక్కుకోలేక పోయారు అనే చెప్పాలి ఇక సుమంత్ కి అయిన ఒకటో రెండో హిట్స్ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు సుశాంత్ కి మాత్రం ఒక్క హిట్ సినిమా కూడా లేదు ఒకటి అర అలా యావరేజ్ గా ఆడిన సినిమాలు ఉన్నాయి అంతే అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న

కూడా సుశాంత్ ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు అంటే సుశాంత్ చూడడానికి బాగున్న ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా పలకడం రాదు, దానికి తోడు ఆయనకి స్టోరీ సెలక్షన్ కూడా తెలీదు ఇంకొకటి ఏంటంటే ఆయన అక్కినేని అనే పెద్ద కుటుంభం నుంచి రావడం కూడా ఆయనకి ఒక మైనస్ అయిందనే చెప్పాలి.ఎందుకంటే అంత పెద్ద ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అంటే ఫ్యాన్స్ తో పాటు జనాల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉంటాయి దానివల్ల కూడా ఆయన సక్సెస్ కాలేకపోయాడు.ప్రస్తుతానికి సుశాంత్ హీరోగా ఇంకా కూడా ట్రై చేస్తున్నాడు చూడాలి మరి ఫ్యూచర్ లో అయిన ఆయనకి మంచి సక్సెస్ వస్తుందో లేదో.

Advertisement
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు