అప్పుడు ఎన్టీఆర్, నేడు మహేష్.. రాజమౌళితో భలే కుదిరిందిగా?

సాధారణంగా కొన్ని సార్లు కొన్ని విషయాలు అనుకోకుండా ఎంతో కోఇన్సిడెన్స్ గా జరుగుతూ ఉంటాయి.ఇలా జరిగాయని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.

 Then Ntr And Today Mahesh With Rajamouli , Rajamouli, Tollywood, Mahesh Babu, Jr Ntr, Telugu Film Industry,koratala Siva, Trivikram Srinivas, 29th Films By Rajamouli-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇలాంటి కో ఇన్సిడెన్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్ విషయంలో జరిగింది.జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 29 చిత్రాలలో నటించి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 29వ చిత్రాన్ని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

 Then Ntr And Today Mahesh With Rajamouli , Rajamouli, Tollywood, Mahesh Babu, Jr Ntr, Telugu Film Industry,koratala Siva, Trivikram Srinivas, 29th Films By Rajamouli-అప్పుడు ఎన్టీఆర్, నేడు మహేష్.. రాజమౌళితో భలే కుదిరిందిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే మహేష్ బాబు కూడా ఇప్పటివరకు 27 సినిమాలను చేసి ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే తన 27వ చిత్రం సర్కారు వారి పాట కాగా, 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు.ఇకపోతే తన 29వ చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నారు.

ఈ విధంగా ఎన్టీఆర్, మహేష్ బాబు ఇద్దరూ కూడా వారి 29వ చిత్రాలను రాజమౌళి దర్శకత్వంలో చేయడం విశేషం.

Telugu Rajamouli, Jr Ntr, Koratala Siva, Mahesh Babu, Telugu, Tollywood-Movie

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా గురించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉంటుందని మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.మహేష్ బాబు వీలైనంత త్వరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ చిత్రాన్ని పూర్తి చేసి వెంటనే రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube