పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అనన్య పాండే కలిసిన నటించిన తాజా చిత్రం లైగర్.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే.
అయితే లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు అని అందరూ అనుకున్నారు.అంతేకాకుండా సినిమా విడుదలకు ముందే విజయ్ నీ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లోకి చేర్చారు.
విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాని చూసిన తర్వాత నెటిజన్స్, అభిమానులు విజయ్ దేవరకొండ తో పాటు చిత్ర బృందం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం పడ్డ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.కాగా విజయ్ దేవరకొండ ఈ సినిమా రిలీజ్ కి ముందు చేసిన కామెంట్స్ ఈ వైఫల్యానికి కారణం అంటున్నాడు ఒక థియేటర్ యజమాని.
తాజాగా ముంబైలోని ఓ థియేటర్ యజమాని అయిన మనోజ్ దేశాయ్.విజయ్ దేవరకొండ పై ఫైర్ అయ్యాడు.ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.మా సినిమాను బాయ్‌కాట్ చేసుకోండి అని చెప్పి తెలివిని ప్రదర్శించానని అనుకుంటున్నావా? నీ సినిమాను కనీసం ఓటీటీలో కూడా చూడరు.అంతేకాదు నీ ప్రవర్తన వల్ల మేము కూడా నష్టపోతున్నాం, అడ్వాన్స్ బుకింగ్స్ పై కూడా దాని ఎఫెక్ట్ పడింది.

మిస్టర్ విజయ్ దేవరకొండ.నువ్వు కొండవి కాదు అనకొండవి.అనకొండలాగే మాట్లాడావు.
వినాశకాలే విపరీతబుద్ధి అంటారు కదా.అయినా నాశనమయ్యే సమయం వచ్చినప్పుడు నోటినుంచి ఇలాంటి మాటలే వస్తాయి, నువ్వు కూడా అలాగే మాట్లాడావు.అయినా అది నీ ఇష్టం.విజయ్, నువ్వు చాలా అహంకారివి.నచ్చితే చూడండి, ఇష్టం లేకపోతే అసలు చూడకండి అన్న మాటలు ఎంత చేటు తెచ్చాయో నీకింకా అర్థం కావడం లేదా? ఇంతక ముందు బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, తాప్సీ, అక్షయ్ కుమార్ అలా వాఖ్యలు చేసి సినిమాలు ఎలా కొట్టుకుపోయాయో చూడలేదా? లైగర్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.కానీ నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్ల చాలా నష్టం జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు థియేటర్ యజమాని.







