ఇటీవల ఒక యువకుడు తన తల్లితో వీడియో కాల్(video call with Mother) లో మాట్లాడుతూనే ప్రాణాలు విడిచాడు.దాంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
తాజాగా వారు తమ కుటుంబ సభ్యుడి మరణం విషయంలో కోర్టు మెట్లు కూడా ఎక్కారు.వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ లండన్‌కు చెందిన 19 ఏళ్ల ఇద్రీస్ కయ్యూమ్(Idris Qayyum) అనే యువకుడు తుర్కియేలోని అంటాల్యలో ప్రయాణిస్తున్నప్పుడు వేరుశెనగలు కలిపిన డెజర్ట్ తిన్నాడు.
అది తిన్న కొద్ది నిమిషాలకి అతను మరణించడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.వేరుశెనగకు తీవ్రమైన అలర్జీ ఉన్న ఇద్రీస్(Idris) మొదటిసారి ఫ్యామిలీని విడిచి తుర్కియే/టర్కీ(Turkey) దేశానికి వెళ్లాడు.
తన వారం రోజుల పర్యటనలో మొదటి రోజు రాత్రి, ఇద్రీస్ తన స్నేహితుడితో కలిసి మార్టి మైరా హోటల్‌లోని రూఫ్‌టాప్ టెర్రేస్‌లో భోజనం చేస్తున్నాడు.ఇద్రీస్ తనకు వేరుశెనగల అలర్జీ(Peanut allergy) ఉందని వెయిటర్‌కు ఇంగ్లీషులో చెప్పడమే కాకుండా, గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉపయోగించి కూడా స్పష్టం చేశాడు.
అయినప్పటికీ, వెయిటర్ ఆ డెజర్ట్ తినడానికి సురక్షితమని తప్పుడు హామీ ఇచ్చాడు.
డెజర్ట్ తిన్న వెంటనే ఇద్రీస్‌కు అనారోగ్యం అనిపించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.పరిస్థితి మరింత దిగజారడంతో తన స్నేహితుడితో కలిసి హోటల్ గదికి తిరిగి వచ్చాడు.ఆందోళన చెందిన స్నేహితుడు వెంటనే ఇద్రీస్ తల్లి అయేషా బాథియాకు (Ayesha Bathiya)వీడియో కాల్ చేశాడు.
అయేషా బాథియా లండన్‌లో ఉండగా, ఈ దృశ్యాన్ని చూసి ఆమె భయంతో తల కొట్టుకుంది.ఎమర్జెన్సీ సిబ్బంది సీపీఆర్(CPR) చేస్తూ ఇద్రీస్‌ను కాపాడే ప్రయత్నం చేశారు.దురదృష్టవశాత్తు, 25 నిమిషాలలోనే ఇద్రీస్ గుండె ఆగిపోయింది, అతను చనిపోయినట్లు ప్రకటించారు.
అయేషా బాథియా ఇద్రీస్ తన అలర్జీని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకునేవాడని చెప్పింది.అతను ఎప్పుడూ ఎపిపెన్, యాంటీహిస్టామైన్స్, ఆస్తమా పంప్ తీసుకువెళ్లేవాడు.ఆమె మాట్లాడుతూ “19 ఏళ్ల వయసులో అతన్ని కోల్పోవడం, అతనికి సహాయం చేయలేకపోవడం నాకు భరించలేనిది” అని బాధతో చెప్పింది.
ఇద్రీస్ కుటుంబం, ఈ ప్రమాదానికి టూర్ ఆపరేటర్ అయిన లవ్ హాలిడేస్, హోటల్ బాధ్యత వహించాలని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది.వారి అభిప్రాయం ప్రకారం, పూర్ కమ్యూనికేషన్, ఆహార అలర్జీల గురించి సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం వల్లే ఈ విషాదం జరిగింది.
ఇద్రీస్ జిమ్‌కు వెళ్లేవాడు, లైఫ్‌గార్డ్‌గా పనిచేసేవాడు.ఇటీవలే డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యాడు.అతను ఎలక్ట్రీషియన్‌గా మారి, ఒక బిజినెస్ మొదలుపెట్టి, యూనివర్సిటీకి వెళ్లాలని కలలు కన్నాడు.ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న అతను ఇక లేడు అనే నిజాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.