పోలీసులపై అటాక్ చేసిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్..

సాధారణంగా పోలీసులు ఎవరినైనా అరెస్టు చేయాల్సి వస్తే ఆ ప్రజలు బాగా వణికి పోతారు.కానీ యూకే ( UK )దేశంలో పరిస్థితి వేరేలా ఉంటుందని కొందరు చెబుతుంటారు.

 The Young Man Attacked The Police Shocking Video Viral , Viral News, Latest News-TeluguStop.com

ఎందుకంటే బ్రిటిష్ పోలీసులు( British police ) మామూలు వ్యక్తులను అరెస్ట్ చేసేటప్పుడు గన్ క్యారీ చేయరు.ఒక చిన్న లాఠీ, లేదంటే పెప్పర్ స్ప్రే లాంటిది చేత పట్టుకొని వెళుతుంటారు.

అరెస్టు చేశాక పెద్దగా కొట్టకుండా వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు.అందుకే వీరిని వెరీ నైస్ పోలీస్ పర్సన్స్ అని పిలుస్తారు.

అయితే ఈ మంచిని కొందరు అదునుగా భావించి ఎదురు తిరుగుతుంటారు.అంతేకాదు పోలీసులపై దాడులకు కూడా దిగుతుంటారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోలో కూడా ఇదే జరిగింది.

@PicturesFoIder ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియో 38 సెకన్ల నిడివి కలిగి ఉంది.దీనికి 2 కోట్ల 51 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.లక్ష వరకు లైక్స్ వచ్చాయి.

ఈ వీడియో చివరిలో ఎవరో ఒక వ్యక్తి ఒక మహిళ వైపు చక్రాన్ని విసిరారు.అది తగిలి ఆమె కింద పడిపోయింది.

ఆ చక్రాన్ని కెప్టెన్ అమెరికా విసిరారా? అనే ప్రశ్నను ఈ వీడియోకి ఒక క్యాప్షన్‌గా జోడించారు.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి నలుగురు పోలీసులపై చేయి చేసుకోవడం మనం చూడవచ్చు.అయితే ఆ నలుగురు పోలీసులు అతడిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప కొట్టడం లేదు.పక్కనే ఆ వ్యక్తి ఫ్యామిలీ కూడా పోలీసులు పై అటాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ సమయంలో పోలీసులు వారిని బెదిరించే ప్రయత్నం చేశారు.

చివరికి ఎలాగోలా అటాక్‌ చేస్తున్న వ్యక్తిని నేలపై పడుకోపెట్టి అరెస్ట్ చేశారు.అయితే వీడియో చివరిలో ఎవరో ఒక చక్రం విసిరితే ఒక మహిళకు తగిలింది.దాంతో ఆమె కింద పడిపోయింది.స్పృహ కూడా తప్పింది.

చివరికి ఆ మహిళకు ఎంత పెద్ద గాయం అయిందో తెలియ రాలేదు.ఈ వీడియో చూసిన చాలామంది షాక్ అవుతున్నారు.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube