టాలీవుడ్ లోఉన్న యంగ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి( Naveen polishetty ) ఒకరు ఈయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.ముఖ్యంగా జాతిరత్నాలు( Jathi Ratnalu ) సినిమా అయితే ఆయన కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా అనే చెప్పాలి.
నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక రకమైన కొత్త దానం ఉండేలా చూసుకుంటాడు.ఇక ఇప్పుడు ఆయన చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కూడా మంచి నటన ని కనబర్చి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.
ఈ సినిమా ఇవాళ్లనే రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది.ఇక జాతిరత్నాలు తర్వాత ఆయన చాలా టైం తీసుకొని చేసిన సినిమా కావడం తో ఈ సినిమా మీద మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి…దానికి తగ్గట్టు గానే అనుష్క నవీన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని తెలుస్తుంది…ఈ సినిమా చూసిన చాలా మంది జనాలు ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా చేశారు అంటూ సినిమా టీమ్ ని పొగుడుతున్నారు…
ఇక మెదటి నుంచి థియేటర్ ఆర్టిస్ట్ కావడం వల్ల నవీన్ కూడా తన నటనలో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వచ్చాడు.ఇక ఈ సినిమా తరువాత ఒక పెద్ద డైరెక్టర్ డైరెక్షన్ లో నవీన్ సినిమా ఉండబోతుంది అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటె మళ్లీ ఇంకో సినిమా అనుదీప్ డైరెక్షన్( Anudeep KV ) లోనే ఉంటుంది అని కూడా కామెంట్లు వస్తున్నాయి…ఇది జాతిరత్నాలు సినిమా కి సీక్వల్ గా వస్తుందా లేక ఇంకో ఫ్రెష్ స్టోరీ తో వస్తుందా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇది కూడా జాతిరత్నలు లాగానే హిట్ అవుతుందా అనేది చూడాలి.
ఇక అలాగే నవీన్ పోలిశెట్టి హీరో గా ఇక మొదట వరుసగా సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది…
.