స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి కావాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :వేసవి సెలవులు( summer holidays ) ముగిసి స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరమ్మతు పనులు పూర్తి కావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) ఆదేశించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల, అల్మాస్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, వీర్నపల్లి మండలం కంచర్ల మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, గర్జనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేయనున్న మరమ్మతు పనుల ప్రణాళికను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి( Gouthami Poojari )తో కలిసి శుక్రవారం పరిశీలించారు.

అనంతరం ఆయా స్కూల్ లలో తరగతి గదులు, మరుగు దొడ్లు, నీటి వసతి, విద్యుత్ సౌకర్యాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

ప్రభుత్వ నిబంధనల( Government regulations ) ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు, మరుగు దొడ్ల లో మరమ్మతు పనులు చేయించాలని సూచించారు.విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాగు నీటి వసతి కల్పించాలని ఆదేశించారు.

తరగతి గదులలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని వివరించారు.ఆయా పనులు త్వరగా మొదలు పెట్టి నాణ్యతా ప్రమాణాల ప్రకారం పూర్తి చేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

ఇక్కడ టీఎస్ఈ డబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథన్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News