ఒక చెయ్యి లేకపోయినా గిన్నిస్ రికార్టు సృష్టించిన మహిళ

ఎవరికైనా చిన్న సమస్య తలెత్తితే చాలా బాధపడిపోతుంటారు.ఆర్థిక సమస్యలో, కుటుంబ వివాదాల్లో, మరేదైనా చిక్కులు వస్తే నానా హైరానా పడిపోతారు.

తమకు వచ్చిన కష్టాలు ఇంకెవరికీ ఉండవని గుండెలు బాదుకుంటారు.అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న చాలా మంది కష్టం వచ్చినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు.

శరీరంలో ఏదైనా అవయవం లేకపోయినా, మరేదైనా ప్రాణాంతక సమస్య వేధిస్తున్నా అటువంటి వారి పరిస్థితి దుర్భరంగా ఉంటుంది.అయితే ఓ మహిళ ఒంటి చేత్తో ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఆమెకు సంబంధించిన స్పూర్తిదాయక కథనమిలా ఉంది.ఒంటి చేత్తో ఉన్న ఓ మహిళ 1,229 అడుగుల 9 అంగుళాల నిలువు దూరాన్ని అధిరోహించి కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది.

Advertisement

లండన్‌లో నివసిస్తున్న అనౌషే హుస్సేన్‌ అనే మహిళ ఈ రికార్డు సృష్టించింది.ఆమెకు కుడి చేయి మోచేతి కింది భాగం ఉండదు.

అయినప్పటికీ పర్వతారోహణ అంటే ఆమెకు ఎనలేని మక్కువ. మార్షల్ ఆర్ట్స్ బాగా నేర్చుకున్న ఆమె లక్సెంబర్గ్ జాతీయ జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది.

ఆమె 10 సంవత్సరాల క్రితం ఎహ్లర్స్-డాన్లోస్ సిండ్రోమ్ అనే దీర్ఘకాలిక వ్యాధి బారిన పడింది.దాని నుంచి కోలుకునే లోపే క్యాన్సర్ బారిన కూడా పడింది.

దీంతో చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పింది.క్యాన్సర్ నుంచి కోలుకునే క్రమంలో దీర్ఘకాలిక నొప్పిని తట్టుకునేందుకు మరేదైనా వ్యాపకం అలవర్చుకోవాలని అనుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

సాధారణంగా అన్ని అవయవాలు బాగా పని చేస్తున్న వారు సైతం క్లైంబింగ్ అంటే భయపడతారు.అలాంటి ఆటలకు కూడా దూరంగా ఉంటారు.అయితే అనౌషే హుస్సేన్ తన అవరోధాలను అధిగమించింది.374 మీటర్ల ఎత్తు క్లైంబింగ్‌ను ఒంటి చేత్తో, కేవలం గంట వ్యవధిలోనే ఎక్కింది.ఈ క్రమంలో ఒంటి చేత్తో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఎత్తు ఎక్కిన మహిళగా గిన్నిస్ రికార్డు సృష్టించింది.

Advertisement

దీంతో ఆమె గురించి అందరికీ తెలిసింది.సోషల్ మీడియాలో ఆమె జీవితం గురించిన వివరాలు రావడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.

ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచావంటూ అభినందిస్తున్నారు.

తాజా వార్తలు