గతంలో అమరావతి రాజధాని ఎక్కడ కట్టాలి అని అసెంబ్లీ వేదిక చర్చ జరిగింది.ఒక్క చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కాదు.
గతంలో అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగినప్పుడు, ఇప్పటి సీఎం జగన్ రాజధానిని అమరావతిలోనే పెట్టాలి అని ఒప్పుకున్నారు.రాజధాని అమరావతి అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి.
ఈ రోజు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రాన్ని తీసుకొచ్చారు.రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.
వైసీపీ రాజధాని రైతులను ఒక దొంగలుగా చిత్రీకరించింది.గతంలో అమరావతి టూ తిరుపతి పాదయాత్ర చేస్తే రైతులు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు.
ప్రజల ద్వారా ఉత్తరాంద్ర ప్రజల ఆశీర్వాదం కొరడానికి వస్తున్న వాళ్ళని ఉన్మాదులు అంటున్నారు.స్పీకర్ స్థానాల్లో ఉంది హుందాగా ఉండాల్సిన వ్యక్తి, పాదయాత్రలను అడ్డుకుంటాం అంటున్నారు.
పదవి రాక ముందు ఒక మాట, పదవి వచ్చాక ఒక మాట్లాడే వ్యక్తి మంత్రి ధర్మాన ప్రసాదరావు.గతంలో జగన్ ఏ రకంగా తిట్టవో మర్చిపోయావ ధర్మాన ప్రసాదరావు.
కొంత మంది చంద్రబాబు ఉత్తరాంధ్రకు అన్యాయం చేసారు అని మాట్లాడుతున్నారు.అమరావతి రైతులు చేస్తున్న పాదయత్రకి మద్దతు ఇస్తాము.
పాదయాత్రలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య వచ్చినా డీజీపీ దే బాధ్యత.