ప్రపంచమంతా సూపర్ అంటున్న.. ఆర్జీవికి మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా 'సర్కస్'లా కనిపిస్తుందేంటో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారెవ్వరు లేరు.నిజానికి ఈయన పరిచయం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పాకింది.

 The Whole World Is Saying Its Super But For Rgv Rrrs Movie Looks Like Circus, Ra-TeluguStop.com

ప్రేక్షకులనుండి సెలబ్రెటీల వరకు వర్మ ఏంటో అందరికీ తెలుసు.ఒకప్పుడు వర్మ మంచి దర్శకుడుగా మంచి మంచి సినిమాలు తెరకెక్కించాడు.

మంచి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

చాలావరకు యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు.

అంతేకాకుండా స్టార్ హీరోలు సైతం వర్మ కాంబినేషన్ లో నటించారు.ఇక ఈ మధ్య వర్మ ప్రతి ఒక్క విషయంలో సంచలనంగా మారుతున్నాడు.

గత కొంత కాలం నుండి ఆయన అభిరుచులు మొత్తం మారిపోయాయి.

సినిమా విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయం లో కూడా వర్మ స్టైల్ మొత్తం మారింది.

ఈ మధ్య ఎక్కువ కాంట్రవర్సీ సినిమాలను తెరకెక్కిస్తూ బాగా కాంట్రవర్సిగా మారుతున్నాడు.దాంతో నెటిజన్ల నుండి బాగా కౌంటర్లు, ట్రోలింగ్స్ ఎదుర్కొంటాడు.కానీ వాటి గురించి అస్సలు పట్టించుకోడు వర్మ.

ఒకవేళ పట్టించుకుంటే మాత్రం ఆయన ఇచ్చే రీ కౌంటర్ బాగా హైలెట్ అవుతుంది.

మరోసారి కూడా అటువంటి ట్రోలింగ్ రాకుండా తన కౌంటర్ తో స్టాప్ చేసేస్తాడు.వర్మ వ్యక్తిగతంగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలంతా వర్మతో బాగా క్లోజ్ గా ఉంటారు.ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వర్మకు బయట చాలా కలర్ ఫుల్ జీవితం ఉంది.

ఆయన కలర్ లైఫ్ ని చూసి ఎంతో మంది ఈర్ష పడుతుంటారు కూడా.ఇక వర్మ వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు షోలలో పాల్గొని బాగా రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు.

తన బోల్డ్ మాటలతో అందరినీ షాక్ అయ్యేలా చేస్తాడు.ఇక ఈయన సోషల్ మీడియాలో ఫుల్ బిజీ గా కనిపిస్తాడు.

ట్విట్టర్ వేదికగా, ఇన్ స్టాగ్రామ్ వేదికగా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటాడు.సమాజంలో ఏదైనా జరిగినా కూడా వెంటనే తన స్టైల్లో స్పందిస్తాడు.

అప్పుడప్పుడు నటీనటులను ఉద్దేశించి కూడా పలు కామెంట్లు చేస్తూ ఉంటాడు.ఎవరు ఏమన్నా కూడా అస్సలు పట్టించుకోడు.

Telugu Circus, Rajamouli, Ram Gopal Verma, Rrr-Movie

ఆ మధ్య సినిమా టికెట్లపై జరుగుతున్న రచ్చ గురించి కూడా తన సోషల్ మీడియా వేదికగా స్పందించి ఆంధ్రప్రదేశ్ ని దారుణంగా ట్రోల్ చేశాడు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏకంగా కరోనా వైరస్ తో పోల్చాడు.ఇదిలా ఉంటే తాజాగా తన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ను సర్కస్ తో పోల్చాడు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్ అందుకుందో చూసాం.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి అందరూ ఫిదా అయ్యారు కానీ వర్మ ఫిదా కాలేనట్లు తెలుస్తుంది.ఎందుకంటే ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.వర్మకు ఆర్ఆర్ఆర్ సినిమా సర్కస్ లా అనిపించింది అని.సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఆనందం, ఆసక్తి కలుగుతుందో ఆ సినిమా చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ కలిగింది అని అన్నాడు.అంతేకాకుండా వంతెన దగ్గర బాలుడిని కాపాడిన సీన్ లో రామ్ చరణ్, తారక్ జెమినీ సర్కస్ చేస్తున్నట్లు అనిపించిందని అన్నాడు.దీంతో ఈ స్టార్ హీరోల అభిమానులు వర్మపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube