ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్.దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు కుదరవు.
జగన్మోహన్ రెడ్డి ఒక లెక్కఉంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలు గురించి వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది.
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గే అవకాసం.కేంద్రం రాష్రానికి డబ్బులు ఇవ్వడంలేదు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల గురించి తప్పా.రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించడంలేదు.
రాజకీయాలు.ఇప్పుడు వ్యాపారంగా మారిపోయాయి.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నడిచిందే.ప్రత్యేక హోదా కోసం కానీ ముఖ్యమంత్రి అయ్యాక దానిని పక్కన పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ది ప్రత్యేక శైలి.సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఆయన చేసే వ్యాఖ్యలు అందర్నీ ఆకర్షిస్తుంటాయి.
అంతేకాదు ఉండవల్లి ప్రెస్ మీట్ పెడితే కొన్నిరోజుల పాటు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంటాయి.తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్.
ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన పథకాల పేరుతో జగన్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రజలకు డబ్బులిచ్చాను కాబట్టి.వాళ్లు నాకు ఓటు వేయాలనేదే జగన్ విధానమని ఉండవల్లి అన్నారు.
అసలు క్విడ్ ప్రోకో అంటే ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు ఓటు వేయనివారికి పథకాలు ఇవ్వరన్నారు ఉండవల్లి.
ఇదే ఫార్ములాలో జగన్ సక్సెస్ అవుతారా.ఫెయిల్ అవుతారా అనేది ఎవరూ చెప్పలేరన్నారు.
రాజకీయాల్లో ఇలాంటి గ్యాంబ్లింగ్ ను ఎవరూ చేయలేదన్న ఆయన.పథకాలకు ఎక్కడినుంచి డబ్బులు తెస్తారని ప్రశ్నించారు.కేంద్రం నిధులు దుర్వినియోగం చేసిందని చెప్పినా.పేదలకు ఇచ్చానని చెప్తారే తప్ప జగన్ ఫీలవరన్నారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వైఎస్ కాంగ్రెస్ సీఎం అని.ఆయనతో పాటు 30 మంది సేల్స్ మెన్ ఉంటే.ఆయన చీఫ్ సేల్స్ మెన్ అని.ఆయన దగ్గరకు వచ్చిన వారు వేరే వాళ్ల దగ్గరకు వెళ్లకుండా చూసుకునేవారన్నారు.ప్రజలతో రెండోసారి ఓట వేయించుకుని మరీ సీఎం అయ్యారని గుర్తేచేశారు.
కానీ వైసీపీలో పరిస్థితి వేరని.అక్కడ సర్వం జగనేనని.
పక్కా బిజినెస్ నడుపుతున్నారన్న ఉండవల్లి లాభమున్న పనులను మాత్రమే చేస్తున్నారని విమర్శించారు.
ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్న ఉండవల్లి అది ఎరికి కలిసొస్తుందనేది మాత్రం చెప్పలేమన్నారు.ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండటంతో రాజకీయశక్తుల మళ్లీ కలుస్తున్నాయన్నారు.2014 నుంచి రాష్ట్రంలో నేరుగా కులాల మధ్య యుద్ధం జరగుతోందన్న ఆయన.బ్రదర్ అనిల్ పార్టీపైనా కామెంట్స్ చేశారు.గతంలో ఉన్న సాన్నిహిత్యం మేరకే ఆయన తనను కలిశారని.
కానీ అందులో ఎలాంటి రాజకీయాలపై చర్చ జరగలేదన్నారు
.






