రబీ లో పంటలు పండించి అధిక దిగుబడులు సాధించాలంటే నీటి వసతి చాలా అవసరం.రబీ లో పంటలకు అనువైన వాతావరణం ఉండడంవల్ల దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉంటాయి.
వ్యవసాయ రంగంలో విత్తన ఎంపిక, సరైన సమయంలో విత్తనం, సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు చేపట్టడం చాలా కీలకం నువ్వుల పంటను సాగుకు రబీ కాలం( Rabi season ) చాలా అనుకూలమైన సమయం.ముఖ్యమైన వాణిజ్య పంటలలో నువ్వుల పంట( Sesame crop ) కూడా ఒకటి.
నువ్వుల గింజల్లో నూనె శాతం 45 నుండి 55 వరకు ఉండడం, ప్రోటీన్ల శాతం 25 వరకు ఉండడం వల్ల మార్కెట్లో ఈ పంటకు ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.వేసవికాలంలో నువ్వుల పంటకు రెండు లేదా మూడు నీటి తడులు అవసరం.
ఆ నీటి తడులు అందిస్తే నువ్వుల పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు.
![Telugu Agriculture, Andhra Pradesh, Rabi Season, Rayalaseema, Sesame Crop, Sulph Telugu Agriculture, Andhra Pradesh, Rabi Season, Rayalaseema, Sesame Crop, Sulph](https://telugustop.com/wp-content/uploads/2024/01/The-way-you-cultivate-the-crop-in-Rabi-Proper-management-practicesa.jpg)
ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ నుంచి జనవరి మూడవ వారం వరకు నువ్వుల పంటను విత్తుకోవచ్చు.తెలంగాణలో అయితే జనవరి నుండి ఫిబ్రవరి వరకు విత్తుకోవచ్చు.ఈ నువ్వుల పంటకు తేలికగా ఉండే నేలలు, కండ కలిగిన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
పైగా వేసవిలో పండిన నువ్వు గింజల నాణ్యత బాగుంటుంది.నువ్వుల పంటకు అధికంగా సల్ఫర్ ( Sulphur )అందే విధంగా చర్యలు తీసుకోవాలి.
అప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.
![Telugu Agriculture, Andhra Pradesh, Rabi Season, Rayalaseema, Sesame Crop, Sulph Telugu Agriculture, Andhra Pradesh, Rabi Season, Rayalaseema, Sesame Crop, Sulph](https://telugustop.com/wp-content/uploads/2024/01/The-way-you-cultivate-the-crop-in-Rabi-Proper-management-practicesb.jpg)
ఒక ఎకరం పొలంలో మామూలుగానే ఐదు నుండి 6 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.సకాలంలో నీటి తడులు అందించి, నీటిలో కరిగే ఎరువులను పిచికారి చేసి పంటను చీడపీడల, తెగుల భారి నుండి సంరక్షించుకుంటే ఎకరాకు దాదాపుగా 10 క్వింటాళ్లకు పైగా దిగుబడులు సాధించవచ్చు.నువ్వుల పంటకు తీవ్ర నష్టం కలిగించే సీదపీడల విషయానికి వస్తే పొగాకు లద్దె పురుగులు బిహారి గంగోలి పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.
పూల పంట లేత మొగ్గ దశలో ఉన్నప్పుడు కోడు ఈగలు పంటను ఆశించే అవకాశం ఉంది.కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ సకాలంలో పిచికారి మందులు ఉపయోగించి వీటిని అరికట్టడం వల్ల ఆశించిన స్థాయిలో దిగుబడిను పొందవచ్చు.