సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తుంది

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి రాణి రుద్రమ( Rani Rudrama ) ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు.

ముందుగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి( Sri Raja Rajeshwara Swamy ) వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బిజెపి నాయకులతో కలిసి సిరిసిల్లలో ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

బిజెపి పార్టీలో మహిళలకు,బీసీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పిస్తుందని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు.ఇప్పటివరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిఅభ్యర్థిగా ప్రకటించలేదని, బిజెపి మాత్రమే బీసీలకు ఇచ్చిన గౌరవమని ఆమె తెలిపారు.

అంతేకాకుండా మహిళలకు ఏ పార్టీ ఇవ్వని ప్రాధాన్యత బిజెపి ఇచ్చిందన్నారు.కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతిగా అవకాశం కల్పించిందని, తనకి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడం గొప్ప విషయమని అన్నారు.

Advertisement

సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తుందని, ఈ సిరిసిల్లలో దొరల గడీల పాలన బద్దలు కొడతామన్నారు.దొరల పాలనను బద్దలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈసారి కచ్చితంగా కేటీఆర్ ఇక్కడి నుండి సాగనంపుతామని ఆమె అన్నారు.

సిరిసిల్లలో ఉన్న ప్రతీ కార్యకర్త ఒక శక్తితో సమానమని, తాను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటే ఒక కార్యకర్తగా భావిస్తానన్నారు.బిజెపిలో తాను చేరిన తర్వాత సిరిసిల్ల బాధ్యతలు పార్టీ అధిష్టానం నాకు అప్పగించిందని, సెస్ ఎన్నికల్లో పాలక్ గా నియమించింది అన్నారు.

సెస్ ఎన్నికల్లో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడి గెలిచిందన్నారు.సిరిసిల్ల షాడో ముఖ్యమంత్రి కేటీఆర్( KTR ) పాలనను గద్దె దింపే రోజులు వచ్చాయన్నారు.

ఇక్కడి బిజెపి కార్యకర్తలను అధికార పార్టీ ఎన్ని కష్టాలు పెట్టిన నిలబడి పార్టీ కోసం పని చేసేందుకు నిలబడ్డారని గుర్తు చేశారు.ఎన్నికల్లో బిజెపి గెలుపు తధ్యమని అన్నారు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

ప్రతి ఒక్క కార్యకర్త బిజెపి పార్టీ గెలుపుకు అహర్నిశలు కృషి చేయాలని ఆమె కోరారు.ఈ సమావేశంలో ఎన్నికల జిల్లా ఇన్చార్జి కర్ణాటక ఎమ్మెల్యే విఠల్ సోమన్న, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్, కుమ్మరి శంకర్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News