గాజు గ్లాస్ సింబల్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది.ఈ మేరకు గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ( Rastriya Praja Congress Party )దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.అయితే జనసేన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చడంతో గాజు గ్లాసు గుర్తును కోల్పోయిన సంగతి తెలిసిందే.మరోవైపు గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ ( Free Symbol )జాబితాలో చేర్చుతూ కీలక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.