ప్రొఫెసర్ కోదండరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన టిఆర్ఎస్ తో కలిసి ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు.సకల జనుల సమ్మె తోపాటు, మిగతా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
ఆ తర్వాత విభేదాలు రావడంతో సైలెంట్ అయ్యారు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ జన సమితి పేరుతో కొత్త పార్టీని పెట్టి మహా కూటమి లో చేరారు.ఎన్నికల్లో కోదండరాంతో పాటు, ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారంతా ఓటమి చెందారు .ఆ సమయంలోనే టీజేఎస్ పార్టీని ఇక యాక్టివ్ చేస్తారని అంతా భావించినా, కోదండరాం మాత్రం అడపాదడపా తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు.
ఎన్నికల కు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో, ఇప్పుడు చిన్న చిన్న పార్టీ లకు సైతం ప్రాధాన్యం పెరిగింది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో సత్తా చాటినా, అక్కడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇప్పుడు తెలంగాణ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది.అంతేకాదు తమ పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా సోమ్నాథ్ భారతిని నియమించారు.
ఇటీవల హైదరాబాద్ కు వచ్చి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.అలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన విమర్శలు చేశారు.
తెలంగాణ పేరు చెబితే ఉద్యమ నేపథ్యం అందరికీ గుర్తుకు వస్తుంది.అందుకే ఆ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని తమ పార్టీ తరఫున యాక్టిివ్ చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళ వచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కోదండరామ్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.కాకపోతే టీజేఎస్ ను ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలనే షరతులు విధించారట.ఇప్పటికే దీనిపై చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన అనేకమంది జేఏసీల ఇన్చార్జీలు, ఎన్నారైలు, ప్రముఖులు, స్టూడెంట్ లీడర్స్, కార్మిక నేతలు, సింగరేణి ప్రాంత వాసులతో మంతనాలు చేసినట్లు సమాచారం టీజేఎస్ ను కనుక ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేస్తే కీలకమైన పదవిని ఇచ్చేందుకు, అలాగే తెలంగాణలో టీజేఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని సైతం కోదండరామ్ కు ఇచ్చేందుకు సిద్ధమనే ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.
అయితే టీజేఎస్ ను ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని కోదండరామ్ చెబుతున్నా, దీనిపై పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. .







