రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి( AP BJP Chief Purandeshwari ) అన్నారు.ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీలు వేసుకుంటామన్నారు.
పొత్తుల్లో భాగంగా తమకొచ్చిన సీట్లల్లో అభ్యర్థులను ఖరారు చేశామని పేర్కొన్నారు.
విశాఖ సీటు( Visakha Seat ) తమ పార్టీకి రాలేదన్న పురంధేశ్వరి ఎంపీ అభ్యర్థుల్లో ఒక్కరిని తప్పించి పార్టీలో ఉన్న వారికే టికెట్ ఇచ్చామని తెలిపారు.
గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న క్రమంలో తిరుపతి జిల్లాలో( Tirupati District ) ఉన్న పరిస్థితుల ప్రకారం నిర్ణయం తీసుకున్నామన్నారు.అదేవిధంగా కార్యకర్తలను కాదని తమ నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు.