సిని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ సంపాదన మొత్తాన్ని బిజినెస్ లను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతుంటారు.ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలా వరకు చాలామంది నటీనటులు తమ సొంతంగా బిజినెస్ లను ప్రారంభించి ఓ వైపు నటులుగా మరోవైపు బిజినెస్ పర్సన్స్ గా బాగా బిజీ అవుతున్నారు.
అంతేకాకుండా కొందరు హీరోలు ఒక గ్రూపుగా మారి బిజినెస్ లు కూడా పెడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ముగ్గురు బడా హీరోలు కూడా ఓకే దానిపై బిజినెస్ ప్రారంభించనున్నారు.
నిజానికి పెద్ద పెద్ద సంస్థలపై బడా హీరోలు బాగా ఆసక్తి చూపుతుంటారు.తమ బిజినెస్ ల విషయంలో పొరపాటు కాకుండా చూసుకుంటారు.నిజానికి ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఇలా బిజినెస్ లను బాగా నమ్ముకుంటారు.
ఎందుకంటే ఇండస్ట్రీలో తమకు అవకాశాలు లేకున్నా మరే కారణంతో నైనా ఇండస్ట్రీ నుండి బయటికి వస్తే మాత్రం తమకు ఓ ఆధారం కోసం ముందుగానే కొన్ని ఆలోచనలు చేసి పెట్టుకుంటారు.
ఇండస్ట్రీలో ఉన్న సమయంలోనే పలు బిజినెస్ లను ప్రారంభిస్తారు.దీంతో సినీ ఇండస్ట్రీలో వాళ్ళు అవకాశాలు కోల్పోయిన కూడా బిజినెస్ లపై ఆధారపడుతుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు స్టార్ హీరోలు మరో బిజినెస్ రంగంలో కలిసి మరి అడుగుపెడుతున్నారు.ఇంతకు ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, మహేష్ బాబు. ఇప్పటికే ఈ స్టార్ హీరోలు ఎన్నో బిజినెస్ లు ప్రారంభించారు.ఓ వైపు ఇండస్ట్రీలో కొనసాగుతూ మరోవైపు బిజినెస్ మ్యాన్ లుగా బాగా బిజీ అయ్యారు.
ఇక తాజాగా వీరు ముగ్గురు కలిసి ఓ మల్టీ ప్లెక్స్ ప్రారంభించనున్నారు.ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఏ ఎమ్ బి మల్టీప్లెక్స్ ఐకానిక్ థియేటర్ గా మారింది.
ఓల్డ్ సత్యం థియేటర్ కూడా ఎ ఎ ఎ మల్టి ప్లెక్స్ గా మారుతుంది.త్వరలోనే ఈ మల్టీ ప్లెక్స్ కూడా మరో ఐకానిక్ థియేటర్ గా మారుతుంది.
ఇదిలా ఉంటే ఈ రెండూ మల్టీ ప్లెక్స్ లు కాకుండానే మరో మల్టి ప్లెక్స్ ప్రాజెక్ట్ సిద్ధం కానుంది.

మామూలుగా ఇటువంటి సంస్థలకు ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు బాధ్యత వహిస్తూ ఉంటారు.కానీ తాజాగా ఇప్పుడు సిద్ధమవుతున్న మరో మల్టీ ప్లెక్స్ కు ఏకంగా ఒకే రంగానికి చెందిన స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు, రానా పాలుపంచుకుంటున్నారు.ఇక ఈ మల్టీ ప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సుదర్శన్ థియేటర్ స్థలంలో ఓ పెద్ద మాల్ గా ప్రారంభం కానుంది.
అందులోని కొత్త మల్టీ ప్లెక్స్ రానుంది.ఇక ఈ మల్టీ ప్లెక్స్ పేరు ఎ ఎమ్ బి విక్టరీ. ఇందులో ఎ ఎమ్ బి అంటే ఆసియన్ మహేష్ బాబు అని అర్థం.విక్టరీ అంటే వెంకటేష్.
మొత్తానికి రానాతో పాటు ఈ ఇద్దరు స్టార్ హీరోలు భాగస్వామి కానున్నారు.ఈ వెంచర్ ను ఆసియన్ అధినేత నారాయణ దాస్ నారంగ్ స్థాపిస్తున్నాడు.