ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి.కొంతమంది దొంగలు అయితే కొత్త కొత్త పద్ధతులలో దొంగతనం చేస్తున్నారు.
వారు చేసే దొంగతనాలు అప్పుడప్పుడు వారి ప్రాణాలు మీదికి వస్తూ ఉంటాయి.పోలీసులకు దొరుకుతామనే భయం కూడా లేకుండా కొంతమంది దొంగలు రెచ్చిపోయి దొంగతనం చేస్తూ ఉంటారు.
ఇలాంటి సమయంలో దొంగలు అప్పుడప్పుడు ప్రజల చేతికి చిక్కిపోతుంటారు.కొంతమంది ప్రజలు దొంగలను చచ్చేవరకు కొట్టే వాళ్ళు ఉన్నారు.
ఇలాంటి భయం ఏమీ లేకుండా పట్టపగలే జనాలు తిరుగుతున్నారు, ఈ జనాల్లోనే తప్పించుకోవచ్చని దొంగలు దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తారు.
ఇలాంటి దొంగలు చేసే విచిత్రమైన దొంగతనాలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎంత తెలివిగల దొంగ అయినా ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి కచ్చితంగా దొరికిపోతాడు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది.ఇందులో దొంగ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి లాగా ఉంది.
అలా దొంగలించిన వెంటనే ఆ దొంగ ఘోర ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యాడు.ఒక వ్యక్తి షాప్ వద్ద నిల్చుని ఫోన్ లో ఏదో చూస్తున్నాడు.
ఇంతలో నెమ్మదిగా వచ్చిన ఈ దొంగ మెరుపు వేగంతో ఫోన్ని లాక్కొని రద్దీగా ఉండే రోడ్డును క్రాస్ చేసి పరిగెత్త పోయాడు.

అంతలోనే సడన్గా వచ్చినా కారు అతన్ని ఢీ కొట్టింది.దానితో ఆ దొంగ ఎగిరి రోడ్డుపై పడ్డాడు.అలా దొంగతనం చేసిన మరుక్షణమే రోడ్డు ప్రమాదానికి గురై గురయ్యాడు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.ఈ దొంగకు ఇలా జరగాల్సిందే అని కొంతమంది, అయ్యో పాపం అని మరికొంతమంది, అరేయ్ దొంగతనం అవసరమా ఏదైనా పని చేసుకుని బతుకవచ్చు కదరా బడవ అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







