యాపిల్ స్టోర్‌లో( Apple Store ) దోపిడీ దొంగకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది.అతను తప్పించుకునే సమయంలో తనకు తానుగా గాయపడ్డాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక వ్యక్తి యాపిల్ స్టోర్‌లో దొంగతనం చేసి తప్పించుకునేందుకు రెండవ అంతస్తు నుంచి కిందికి దూకాడు.
అంత పైనుంచి దూకడం వల్ల అతడికి బాగా గాయాలయ్యాయి.దాంతో పైకి లేవలేకపోయాడు.
అక్కడినుంచి పారిపోయేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు కానీ దెబ్బలు బాగా తగలడంతో అక్కడే కుప్పకూలిపోయాడు.
వైరల్ వీడియోలో సందడిగా ఉన్న మాల్ రెండవ అంతస్తు నుంచి దూకి పారిపోవడానికి సాహసోపేతమైన దొంగ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది.కాగా అతను రెండవ అంతస్థ నుంచి దెబ్బ తగలకుండా దూకి లేవపోయాడు.ఒక బాధాకరమైన గాయం ఫలితంగా అతడు విపరీతమైన వేదనతో నేలపై కుప్పకూలాడు.
ఈ దృశ్యం చూపరులను ఆశ్చర్యపరిచింది.దుకాణదారులు, యాపిల్ స్టోర్ ఉద్యోగులు( Shoppers, Apple Store employees ) ఈ దొంగ పరిస్థితి చూసి నవ్వేశారు.భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, వారికి సరెండర్ కావడం తప్ప దొంగ ఏం చేయలేకపోయాడు.ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది తెలియ రాలేదు.కొద్ది గంటల క్రితమే ఈ వీడియోని క్రేజీ క్లిప్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి కోటి 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
అయితే దెబ్బ తగలకుండా రెండోవారం టెస్ట్ నుంచి ఎలా దూకాలో నెటిజన్లు ఆ దొంగకి సలహాలిస్తున్నారు.నిలువుగా కాకుండా అడ్డంగా దూకి కాళ్లపై ల్యాండ్ అయి వెంటనే రోల్ చేయాలని, అప్పుడు దెబ్బ పెద్దగా తాకదని అంటున్నారు.