చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) జరిగినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.ఈరోజు హైకోర్టు( High Court )లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రిలీఫ్ దొరుకుతుందని మెజారిటీ తెలుగుదేశం కార్యకర్తలు ఆశించారు.
అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.దానికి తోడు చంద్రబాబును సిఐడి కస్టడీకి కోరిన సిఐడి రిక్వెస్ట్ ను ఏసిబి కోర్టు అనుమతించి రెండు రోజులు కష్టడీకి బాబుని కేటాయించింది.
దాంతో ఒకేరోజు టిడిపి కి రెండు ఎదురుదెబ్బలు తగిలినట్లు అయింది.అయితే మొదటి నుంచి ఈ విషయంలో తెలుగుదేశం లీగల్ టీం రాంగ్ ట్రాక్ లోనే వెళ్తుందన్నట్లుగా ఇప్పుడు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
![Telugu Ap, Chandrababu, Quash, Supreme-Telugu Political News Telugu Ap, Chandrababu, Quash, Supreme-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/09/Chandrababu-arrest-High-Court-Supreme-Court-Quash-Petition-ap-politics.jpg)
ముఖ్యంగా ఏ కేసులోనైనా అరెస్టు జరిగిన తర్వాత మొదట బెయిల్ కోసం ముందుకు వెళ్లాలని ఒకసారి బెయిల్ దొరికిన తర్వాత అప్పుడు క్వాష్ పిటిషన్ లాంటివి వేసి ఉంటే సరిపోతుందని.పూర్తిగా కేసును కొట్టేయమని ప్రాథమిక సాక్షాదారాలు కనిపిస్తున్న కేసు లో ముందుకు వెళ్ళటం ఒకరకంగా అంత తెలివైన నిర్ణయం కాదంటూ న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.అయితే బెయిల్ కోసం అప్లై చేసుకుంటే తాను అవినీతి చేశాడు కాబట్టే తప్పించుకోవడానికి చూస్తున్నాడని అధికార పార్టీ ప్రజలలో ప్రచారం చేసే అవకాశం ఉందని ఇది ప్రజల్లో ప్రభావం చూపిస్తుందని నమ్మిన తెలుగుదేశం పార్టీ( TDP ) కేసును పూర్తిగా కొ ట్టేయమని హైకోర్టును ఆశ్రయించింది.ఇది పూర్తిగా వైసిపి ట్రాప్ లో పడటమేనని, టెక్నికల్ కారణాలను చూపి కేసును కొట్టేయమన్న అభ్యర్థనను హైకోర్టు అంగీకరించకపోవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో మరోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలా లేక బెయిల్ కోసం అప్లై చేయ్యాలా అన్న డైలమాలో టిడిపి లీగల్ టీం ఉన్నట్టుగా తెలుస్తుంది.
![Telugu Ap, Chandrababu, Quash, Supreme-Telugu Political News Telugu Ap, Chandrababu, Quash, Supreme-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/09/Chandrababu-arrest-Supreme-Court-Quash-Petition.jpg)
ఏది ఏమైనాప్పటికీ కోర్టులో వస్తున్న ఫలితాలు మాత్రం తెలుగుదేశం కార్యకర్తల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తునట్టుగా వారి స్పందన చూస్తుంటేనే అర్థం అవుతుంది.అంతే కాకుండా జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుని అపర చాణక్యుడు లాంటి చంద్రబాబు డైరక్షన్ లేకపోవడం కూడా ఈ పరిస్థితి కి ఒక కారణం గా తెలుస్తుంది .మరి తెలుగుదేశానికి ఊరటం ఇచ్చే నిర్ణయం ఎప్పటికీ రాబోతుందో చూడాలి.