ఈ ఆకుపచ్చని జిలేబీ టేస్ట్ మాములుగా ఉండదు.. ఎలా తయారు చేస్తారంటే..?

జిలేబీలో అనేక రకాల వెరైటీలు ఉంటాయి.పంచదారతో లేదా బెల్లంతో జిలేబీలను తయారుచేయడం చూస్తుంటారు.

పంచదారతో తయారుచేసే జిలేబీలకు, బెల్లంతో తయారుచేసే జిలేబీలకు తీపిలోనూ, రంగులోనూ కాస్త తేడా ఉంటుంది.పంచదారతో తయారుచేసిన జిలేబీలు కాస్త తెల్లగా కనిపిస్తాయి.

ఇక బెల్లంతో తయారుచేసినవి వేరే రంగులో ఉంటాయి.ఆరెంజ్, బ్రౌన్ రంగుల్లో జిలేబీలు ఉంటాయి.

కానీ తాజాగా ఆకుపచ్చ రంగులో ఉండే వెరైటీ జిలేబీలను తయారుచేశారు.ఆకుపచ్చ రంగులో కనిపించే ఈ జిలేబీలను మౌంటెన్ డ్యూ జిలేబీగా పిలుస్తున్నారు.

The Taste Of This Green Jalebi Is Not Normal.. How To Make It, Green Jelebi, Ma
Advertisement
The Taste Of This Green Jalebi Is Not Normal.. How To Make It, Green Jelebi, Ma

ఆకుపచ్చ జిలేబీలను( Green jelebi ) కర్ణాటకలోని బెంగళూరులో కొంతమంది విక్రయిస్తున్నారు.అవెరాబోల్ జిలేబీ పేరుతో వీటిని అమ్ముతున్నారు.అవేరేబెలే అనే బీన్స్ తో ఈ కొత్త రకం జిలేబీని తయారుచేస్తున్నారు.

అవేరేబెలో బీన్స్ ఆకుపచ్చని రంగులో ఉంటాయి.చిక్కుడు జాతికి చెందిన వీటిని తొక్క ఒలిస్తే లోపల ఆకుపచ్చని బీన్స్ ఉంటాయి.

ఈ బీన్స్ ను పిండిలా చేసి దానితో గ్రీన్ జిలేబీలను తయారుచేస్తున్నారు.చక్కెన, తేనె వంటి సిరప్‌లలో వీటిని ముంచడం వల్ల జిలేబీలు ఆకుపచ్చగా కనిపిస్తాయి.

The Taste Of This Green Jalebi Is Not Normal.. How To Make It, Green Jelebi, Ma

ఈ అవేరేబెలే బీన్స్ లలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ( Amino acids ) పుష్కలంగా లభిస్తాయి.అలాగే యాంగ్జయిటీని తగ్గించడంతో పాటు మానసిక స్థితిని కంట్రోల్ లో ఉంచుతుంది.అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

ఇలా ఈ బీన్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.దీంతో బీన్స్ తో తయారుచేసిన ఈ ఆకుపచ్చని జిలేబీలను తినేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు.

Advertisement

ఫుడీ ఇన్‌క్రానెట్ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ జిలేబీలకు సంబంధించిన వీడియోలను షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతుంది.

ఈ ఆకుపచ్చని జిలేబీలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

తాజా వార్తలు