మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.జూన్ 30 వ తేదీ లోపు కేసు దర్యాప్తును పూర్తి చేయాలని గతంలో ధర్మాసనం సీబీఐకి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా విచారణలో భాగంగా నిందితులతో పాటు సాక్షులు, అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు.అదేవిధంగా వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సైతం విచారించిన సీబీఐ అధికారులు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.
ఈ క్రమంలోనే అవినాశ్ ముందస్తు బెయిల్ పొందిన తరువాత ఐదుసార్లు ఆయనను ప్రశ్నించింది సీబీఐ.కాగా జులై 3 వ తేదీన సుప్రీంకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరగనుంది.
అయితే విచారణ ముగించాలన్న ఆదేశాల నేపథ్యంలో ఇవాళ మరోసారి వివేకా హత్య కేసును కోర్టు విచారించనుంది.