అతి పెద్ద ముప్పు నుంచి తప్పించుకున్న అగ్రరాజ్యం.. ఆ బిల్లు పాస్

ప్రపంచంలో అగ్రరాజ్యం ఏందంటే.అమెరికా( America )అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు.

 The Superpower Escaped From The Biggest Threat That Bill Was Passed Details, Sup-TeluguStop.com

ఎందుకంటే అగ్రరాజ్యం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెంది ప్రపంచాన్నే శాసించే స్ధితికి చేరుకుంది.దీంతో వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో చాలామంది అమెరికాకు వెళ్లి అక్కడే జీవిస్తారు.

అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటారు.ఉద్యోగం, చదువుల కోసం పెద్దసంఖ్యలో చాలామంది అమెరికాకు వెళుతూ ఉంటారు.

అయితే అగ్రరాజ్యం అమెరికా దివాలా ముప్పు నుంచి తప్పించుకుంది.సెనెట్‌లో డెట్ సీలింగ్ బిల్లు పాస్( Debt ceiling bill passes in Senate ) అవ్వడంతో అమెరికా కొద్దిలో దివాలా గండాన్ని తప్పించుకున్నట్లైంది.

ప్రతినిధుల సభలో బుధవారం ఈ బిల్లుకు ఆమోదముద్ర లభించగా.గురువారం సెనేట్ కూడా ఆమోదం తెలిపింది.63-36 ఓట్ల తేడాతో సెనేట్‌లో ఈ బిల్లుకు ఆమోదం దక్కింది.ప్రతినిధుల సభ, సెనేట్ ఒకే చెప్పడంతో ఇప్పుడు ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Biden ) దగ్గరకు చేరుకుంది.

జో బైడెన్ సంతకం చేస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది.ఈ బిల్లు అమల్లోకి వస్తే విదేశాల నుంచి లేదా దేశీయంగా అప్పులు తెచ్చుకునే పరిమితిని పెంచుకునేందుకు యూఎస్‌కు అవకాశం లభిస్తుందన్నమాట.

Telugu America, America Debt, Debt, International, Joe Biden, Superpower-Telugu

బిల్లు అమల్లోకి వస్తే 3.14 లక్షల కోట్ల డాలర్ల వరకు యూఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవచ్చు.అప్పు పరిమితిని పెంచుకోవడానికి అవకాశం లభించకపోతే యూఎస్‌ ప్రభుత్వం దివాలా తీసే( The US government will go bankrupt ) అవకావముంటుంది.అమెరికా దివాలా తీస్తే దాని ప్రభుత్వం అన్ని దేశాలపై పడుతుంది.

ఇప్పుడు అమెరికాలోని ప్రతిపక్ష నేతలు కూడా ఒకే చెప్పడంలో సెనేట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందడటంతో పెను ప్రమాదం తప్పినట్లైయింది.ఈ బిల్లు ఆమోదంతో ప్రపంచదేశాలు కూడా ఊపిరిపీల్చుకున్నాయి.

వచ్చే ఏడాది నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరగనున్నాయి.దీంతో జో బైడెన్ ప్రభుత్వం పథకాలకు తెగ ఖర్చు చేస్తుందని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube