ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ పరిపాలనలో రాష్ట్రం రావణకాష్టంలా తయారైందని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నక్కా ఆనంద్ బాబు తెలిపారు.ఈ క్రమంలోనే చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ జలాశయం వద్ద జగన్ కొత్త తరహా మోసానికి తెర తీశారని ధ్వజమెత్తారు.తెలంగాణ సీఎం మోచేతి నీళ్లు జగన్ తాగుతున్నాడన్న ఆయన తెలంగాణకు రాజకీయ లబ్ది చేకూర్చడానికే జగన్ జలజగడం సృష్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు.