సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో తమ కంటు స్పెషల్ గుర్తింపు పొందడానికి చాలా రకాలైన సినిమాలను చేస్తూ మంచి గుర్తింపు పొందుతూ ఉంటారు.అలాంటి హీరోలు సినిమాల్లో పాత్ర నచ్చితే కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు కూడా చేయడానికి ఇష్టపడుతుంటారు.
ఇప్పటికే చాలా మంది హీరోలు విలన్లు గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఇక సుధీర్ బాబు హీరోగా వచ్చిన వి అనే సినిమాలో నాని విలన్ గా నటించి చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక గౌతమ్ నంద( Goutham Nanda ) సినిమాలో గోపీచంద్ డ్యూయల్ రోల్ చేసాడు అందులో ఒక పాత్ర విలన్ కాగా మరో పాత్ర హీరోగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు.అలాగే హీరో కార్తికేయ కూడా నాని హీరోగా వచ్చిన జెంటిల్ మేన్( Gentleman ) సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంశలు అందుకున్నాడు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు హీరో పాత్రలే కాకుండా క్యారెక్టర్ బాగుంటే విలన్ గా నటించడానికి కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.ఎందుకంటే హీరోగా మాత్రమే చేస్తే యాక్టింగ్ తాలూకు స్కిల్స్ అనేవి పడటం లేదు కాబట్టి విలన్ గా చేస్తే యాక్టింగ్ లో ఉన్న డెప్త్ అన్నది బయటకు వస్తుంది.అలాగే వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ల నటన ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు అవుతుందని హీరోలు అనుకొని విలన్ రోల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథ రవితేజ కి బాగా నచ్చి అందులో విలన్ పాత్ర పోషించబోతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి…

మరి ఆ సినిమాలో హీరో ఎవరు అనేది ఇంకా ఫైనల్ గా తెలియదు కానీ రవితేజ( Ravi teja ) మాత్రం విలన్ రోల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.హీరో రవితేజనే ఉంటాడా లేదంటే బయట ఇంకొక హీరో ఉంటాడా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…
.







