సౌందర్య( Soundarya ).దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఈ నటి తన నటనకి గాను ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది.
అంతేకాదు తన అద్భుతమైన నటనతో నవరస నట మయూరి నే బిరుదును కూడా సంపాదించింది.
అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ ఈమెను జూనియర్ సావిత్రి (Junior Savitri) అని ఆప్యాయంగా పిలుచుకునేవారు.అలా సౌందర్య తన నటనతో దాదాపు 12 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగింది.ఇక ఈ హీరోయిన్ ఖాతాలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా ప్రేమ కథ, లేడీ ఓరియంటెడ్ ఇలా ఎన్నో ప్రత్యేకమైన సినిమాల్లో ఈమె నటించింది.తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సౌందర్య హీరోయిన్ గా రాణించింది.
అలాగే చనిపోయే వరకు సినిమాల్లోనే కొనసాగాలి అనుకున్న సౌందర్య కల మధ్యలోనే ఆగిపోయింది.ఎందుకంటే చిన్న వయసులోనే సౌందర్య ( Soundarya ) విమాన ప్రమాదంలో మరణించింది.
అయితే సౌందర్య తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో చాలామంది స్టార్ హీరోలతో నటించిందట గానీ సౌత్ లోని స్టార్ హీరోతో మాత్రం ఆమె నటించడానికి అస్సలు ఒప్పుకోలేదట.
దానికి ప్రధాన కారణం ఓసారి సౌందర్య ముందు ఆయన అమ్మాయిల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారట.అయితే ఈ విషయంపై సౌందర్య ఆ హీరో పై సీరియస్ కూడా అయిందట.అంతేకాదు మీలాంటి హీరోల వల్లే మిగతా హీరోలకి చెడ్డపేరు వస్తుంది అని అందరి ముందే ఆయనను తిట్టిందట.
కానీ ఆ తర్వాత చాలా సార్లు సౌందర్యకు ఆ స్టార్ హీరోతో( Star hero) కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ మొహం మీద నేను నటించను అని చెప్పిందట.అంతేకాదు కోపంతో ఓసారి సౌందర్య ( Soundarya ) ఆ స్టార్ హీరో ముందు ఉండగానే వేరే వాళ్ళని తిట్టినట్లు పరోక్షంగా ఆయనను తిట్టిందట.
దాంతో ఆ స్టార్ హీరో సౌందర్య తిట్టేది తననే అని గ్రహించి అప్పటినుండి సౌందర్యకు దూరంగా ఉండేవారట అలా సౌందర్య కోపం వస్తే ముందు ఎంత పెద్ద వారు ఉన్నా సరే బుద్ధి చెప్పేదట.