ఔను జమిలి ఎన్నికల దిశగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోం ది.ఇప్పటికే దీనిపై ఒక క్లారిటీకి వచ్చిన మోడీ త్వరలోనే దీనిని ప్రకటించాలని నిర్ణయించారు.
వచ్చే ఏడాది మొదట్లోనే జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని అప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పార్టీసారధులు ప్రకటించారు.ఈ విషయంలో ఏపీ సహా ఇతర రాష్ట్రాలు కలిసి వస్తుండడంతో మోడీ వడివడిగా అడుగులు వేస్తున్నారు.
కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాల్లో జమిలి కూడా ఒకటి.ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు నినాదంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.
ఇప్పటికే అనేక విషయాల్లో దేశంలో ఒకే విధమైన పన్నుల విధానం తీసుకువచ్చారు.అదేవిధంగా విద్యుత్, సాగు, తాగు నీటి పన్నుల విషయంలో ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారు.ఇక, ఇప్పుడు ఎన్నికలను కూడా ఒకే సారి నిర్వహించేందుకు రెడీ అయ్యారు.దీనికి సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిం చిన మోడీ సర్కారు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలిసింది.
దీనిపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మాట్లాడారు.జమిలికి తాము సిద్ధంగా ఉన్నామని జగన్‌ను దించే ఎన్నికలు ఇవేనని ఆయన తాజాగా కుప్పం పర్యటనలోనూ చెప్పుకొచ్చారు.

ఇక, రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్ భేటీలోనూ జగన్ జమిలి ఎన్నికలపై చర్చించినట్టు సమాచా రం.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ కీలక నేతలకు సూచించినట్టు తెలిసింది.ఈ క్రమంలోనే ఎన్నడూ లేని విధంగా అగ్రవర్ణ పేద మహిళలకు కూడా చేయూతను అందించాలని నిర్ణయించారు.అదేవిధంగా పట్టణాలు, నగరాల్లో ఉండే మధ్యతరగతి వారికి ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.
ఇలా ప్రభుత్వం చూపిస్తున్న దూకుడు కూడా జమిలిని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి వచ్చే నెల రెండో వారంలోనే జమిలిపై ప్రధాని ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
ఆ వెంటనే జమిలికి సంబంధించి ప్రణాళికలను విడుదల చేసి వచ్చే ఏడాది ప్రారంభం లేదా కుదిరితే ఈ ఏడాది చివరి నాటికే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు కూడా చెబుతున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.