టీజేఎస్ మూడో ప్లీనరీకి రంగం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీన ప్లీనరీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత ప్రొ.
కోదండరామ్ తెలిపారు.ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.
రైతు రాజ్యం రావాలని బీఆర్ఎస్ పార్టీ అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ప్రొ.కోదండరామ్ విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతు రుణమాఫీ చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.







